Share News

ఎఫ్‌పీఐ పెట్టుబడుల జోరు

ABN , Publish Date - Nov 16 , 2026 | 02:06 AM

భారతీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ పెట్టుబడులు మళ్లీ ఊపందుకున్నాయి. వరుసగా రెండు నెలల పాటు భారీగా నిధులను...

ఎఫ్‌పీఐ పెట్టుబడుల జోరు

  • ఈ నెలలో ఇప్పటికే రూ.84,290 కోట్లు ఇన్వెస్ట్‌

  • రెండు నెలల వరుస ఉపసంహరణలకు బ్రేక్‌

న్యూఢిల్లీ: భారతీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ పెట్టుబడులు మళ్లీ ఊపందుకున్నాయి. వరుసగా రెండు నెలల పాటు భారీగా నిధులను వెనక్కు తీసుకున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ).. ఈ నెలలో ఇప్పటికే ఏకంగా రూ.84,290 కోట్ల నికర పెట్టుబడులను పెట్టారు.అంతర్జాతీయ మార్కెట్లలో ఏఐ ఆధారిత షేర్లలో అమ్మకాల ఒత్తిడి, ముడి చమురు ధరల తగ్గుదల, దేశీయంగా ప్రధాన కంపెనీల షేర్ల ఆకర్షణీయమైన వాల్యూయేషన్లు ఈ పెట్టుబడుల రాకకు దోహదపడ్డాయి. కాగా సెప్టెంబరు నెలలో ఎఫ్‌పీఐలు రూ.35,861 కోట్లు, అక్టోబరులో రూ.34,843 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నా రు. ఈ తాజా పెట్టుబడులతో ఈ ఏడాది ఇప్పటి వ రకు భారత ఈక్విటీల నుంచి ఎఫ్‌పీఐలు ఉపసంహరించుకున్న మొత్తం పెట్టుబడుల విలువ రూ.3 లక్షల కోట్ల నుంచి రూ.2.1 లక్షల కోట్లకు తగ్గింది.

ఈ వార్తలు కూడా చదవండి:

ధరణి అక్రమాలపై సీఐడీ దర్యాప్తు వేగవంతం

వికారాబాద్‌లో మహిళా క్రికెటర్‌ మృతి!

Updated Date - Nov 16 , 2026 | 02:06 AM