Share News

చమురు సురసుర.. మార్కెట్‌ విలవిల

ABN , Publish Date - Sep 10 , 2026 | 02:56 AM

అమెరికా- ఇరాన్‌ పరస్పర దాడులతో పశ్చిమాసియా మరోసారి రణరంగంగా మారడంతో చమురు ధర మళ్లీ 100 డాలర్లు దాటింది. దాంతో భారత స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు...

చమురు సురసుర.. మార్కెట్‌ విలవిల

పశ్చిమాసియా ఉద్రిక్తతలతో 100 డాలర్లు దాటిన క్రూడాయిల్‌ జూసెన్సెక్స్‌ 813 పాయింట్లు డౌన్‌

  • 23,450 దిగువ స్థాయికి నిఫ్టీ

  • 3 నెలల కనిష్ఠానికి సూచీలు

  • రూ.2 లక్షల కోట్ల సంపద ఉఫ్‌

  • రూపాయికి 34 పైసల నష్టం

ముంబై: అమెరికా- ఇరాన్‌ పరస్పర దాడులతో పశ్చిమాసియా మరోసారి రణరంగంగా మారడంతో చమురు ధర మళ్లీ 100 డాలర్లు దాటింది. దాంతో భారత స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు బుధవారం భారీగా నష్టపోయాయి. ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, ఆర్థిక సేవలు, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ షేర్లలో అమ్మకాల కారణంగా సెన్సెక్స్‌ 813.35 పాయింట్లు (1.08 శాతం) పతనమై 74,764.23 వద్దకు జారుకుంది. నిఫ్టీ 203.60 పాయింట్లు (0.86 శాతం) కోల్పోయి 23,431.50 వద్ద ముగిసింది. సూచీలకిది 3 నెలల కనిష్ఠ ముగింపు స్థాయి. కాగా, ఈక్విటీ మదుపరుల సంపదగా భావించే బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.2.01 లక్షల కోట్లు తగ్గి రూ.484.20 లక్షల కోట్లకు (5.09 లక్షల కోట్ల డాలర్లు) పడిపోయింది.

ఐటీ షేర్లు ఢమాల్‌ : సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 24 నష్టపోయాయి. ఫెడ్‌ రేట్ల పెంపు ఆందోళనలతో ఐటీ రంగానికి చెందిన హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు 4.55ు వరకు క్షీణించి సూచీ టాప్‌ లూజర్లుగా మిగిలాయి. టెక్‌ మహీంద్రా 3.87ు, టీసీఎస్‌ 2.26ు పతనమైంది

రూపాయి భారీ క్షీణత: చమురు ధరల పెరుగుదల, ఈక్విటీ మార్కెట్లో నష్టాలతోపాటు విదేశీ మారకం మళ్లీ తరిగిపోవచ్చన్న ఆందోళనల కారణంగా దేశీయ కరెన్సీ విలువ కూడా భారీగా క్షీణించింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఏకంగా 34 పైసల నష్టంతో రూ.95.08 వద్ద ముగిసింది.

ఇవి కూడా చదవండి..

ఎస్-400, ఎస్‌యు-57, బ్రహ్మోస్‌పై భారత్‌ ఫోకస్.. మోదీ-పుతిన్ భేటీలో కీలక చర్చలు..

మరో పదేళ్లలో మనుషుల్ని ఏఐ చంపేయొచ్చు.. ఆంత్రోపిక్‌ పరిశోధకుడి సంచలన హెచ్చరిక..

Updated Date - Sep 10 , 2026 | 02:56 AM