Share News

ఈ వారం ఆటుపోట్లలోనే బులియన్‌ మార్కెట్‌

ABN , Publish Date - Mar 09 , 2026 | 01:10 AM

దేశీయ బులియన్‌ మార్కెట్లో ఈ వారం కూడా ఆటుపోట్లు తప్పేలా లేవు. అంతర్జాతీయ ఉద్రిక్తతలతో గత వారం దేశీయ ఫ్యూచర్స్‌ మార్కెట్లో..

ఈ వారం ఆటుపోట్లలోనే బులియన్‌ మార్కెట్‌

న్యూఢిల్లీ: దేశీయ బులియన్‌ మార్కెట్లో ఈ వారం కూడా ఆటుపోట్లు తప్పేలా లేవు. అంతర్జాతీయ ఉద్రిక్తతలతో గత వారం దేశీయ ఫ్యూచర్స్‌ మార్కెట్లో 10 గ్రాముల పసిడి ధర 0.3 శాతం, కిలో వెండి ధర 5.08 శాతం నష్టపోయాయి. ఈ వారం కూడా అంతర్జాతీయ పరిణామాలే బులియన్‌ మార్కెట్‌ను ప్రధానంగా ప్రభావితం చేయబోతున్నాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులు మరింత ఉధృతమైతే ఈ రెండు లోహాల ధర మరింత పెరిగే అవకాశం ఉంది. యుద్ధానికి లేదా ఉద్రిక్తతలకు తెరపడే అవకాశం ఏమాత్రం కనిపించినా బంగారం, వెండిలో లాభాల స్వీకరణతో అమ్మకాలు హోరెత్తే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాల అంచనా.

ఈ వార్తలూ చదవండి:

బొగ్గులా నల్లగా దోశ.. రెస్టారెంట్ ప్రయోగం వైరల్

కుటుంబంతో సహా వచ్చి గర్ల్‌ఫ్రెండ్ ఇంటి ముందు వ్యక్తి డ్యాన్స్! ఎందుకో తెలిస్తే..

Updated Date - Mar 09 , 2026 | 01:10 AM