అప్రమత్తత బెటర్..
ABN , Publish Date - Jun 01 , 2026 | 02:29 AM
భారత స్టాక్ మార్కెట్లు ఈ వారం ఒడుదొడుకుల్లో ట్రేడయ్యే అవకాశం ఉంది. పశ్చిమాసియాలో శాంతి ఒప్పందంపై పలు వార్తలు వినిపిస్తున్నప్పటికీ అది కార్యరూపం దాల్చటం లేదు...
భారత స్టాక్ మార్కెట్లు ఈ వారం ఒడుదొడుకుల్లో ట్రేడయ్యే అవకాశం ఉంది. పశ్చిమాసియాలో శాంతి ఒప్పందంపై పలు వార్తలు వినిపిస్తున్నప్పటికీ అది కార్యరూపం దాల్చటం లేదు. అనిశ్చితి అలాగే కొనసాగుతోంది. మరోవైపు క్రూడ్ ధరల్లో హెచ్చుతగ్గులు, నెగెటివ్ సెంటిమెంట్ వంటివి సూచీలను పడేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మదుపరులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించటం మంచిది.
స్టాక్ రికమండేషన్స్
గుజరాత్ గ్యాస్: కొన్నేళ్లుగా డౌన్‌ట్రెండ్‌లో కొనసాగుతూ వస్తున్న ఈ షేరు మళ్లీ పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. స్వల్పకాల మూవింగ్ యావరేజె్‌స పైనే షేరు ధర కదలాడుతోంది. పైగా 200 రోజుల మూవింగ్ యావరేజీని అధిగమించింది. ఫలితాలు విడుదల కావటంతో ఈ కౌంటర్‌పై ఆసక్తి నెలకొంది. గత శుక్రవారం రూ.401 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు రూ.390 శ్రేణిలో ఎంటరై రూ.440 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.375 స్థాయిని స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.
ముత్తూట్ ఫైనాన్స్: ఈ ఏడాది ఫిబ్రవరిలో జీవితకాల గరిష్ఠాన్ని తాకిన తర్వాత ఈ షేరు దిద్దుబాటుకు లోనైంది. దాదాపు 26 శాతం మేర పతనమైంది. తాజా ఫలితాల అనంతరం షేరు ధర స్థిరంగా కొనసాగుతోంది. పైగా 200 మూవింగ్ యావరేజీ వద్ద మద్దతు తీసుకుంది. గత శుక్రవారం రూ.3,342 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లోకి రూ.3,320 శ్రేణిలో ప్రవేశించి రూ.3,450 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.3,280 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
సీఏఎంఎస్: జీవితకాల గరిష్ఠం తర్వాత ఈ షేరులో దిద్దుబాటు మొదలైంది. దాదాపు 43 శాతం మేర పతనమైంది. అయితే ఆరోగ్యకరమైన రీతిలో బేస్ ఏర్పడుతోంది. రూ.610 స్థాయిలో రెండు సార్లు మద్దతు తీసుకుని డబుల్ బాటమ్ ఏర్పాటు చేసుకుంది. 200 రోజుల మూవింగ్ వద్ద మద్దతు లభిస్తోంది. గత శుక్రవారం రూ.791 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లోకి మదుపరులు రూ.770 శ్రేణిలో ప్రవేశించి రూ.880 టార్గెట్ ధరతో కొనుగోలు చేయాలి. అయితే రూ.750 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
టెక్ మహీంద్రా: ఈ కౌంటర్‌కు రూ.1,830 వద్ద నిరోధం ఎదురైన తర్వాత దాదాపు 29 శాతం మేర పతనమైంది. అయితే రూ.1,300 స్థాయిలో మద్దతు లభించింది. ఇదే స్థాయిలో కొనుగోళ్లపై ఆసక్తి పెరిగింది. పైగా రిలేటివ్ స్ట్రెంత్ పెరుగుతుండటం గమనార్హం. గత శుక్రవారం రూ.1,483 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,470 శ్రేణిలో పొజిషన్ తీసుకుని రూ.1,580 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.1,450 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
హ్యుండయ్ మోటార్స్: ఈ షేరు గత ఏడాది సెప్టెంబరులో రూ.2,880 వద్ద జీవితకాల గరిష్ఠాన్ని తాకిన తర్వాత క్రమంగా పతనమవుతూ వచ్చింది. దాదాపు 42 శాతం మేర దిద్దుబాటుకు లోనైంది. కీలకమైన రూ.1,660 స్థాయిలో మద్దతు తీసుకుని పుంజుకుంది. ఏప్రిల్ నుంచి 20 శాతం మేర రాబడిని అందించింది. గత శుక్రవారం రూ.1,928 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లోకి మదుపరులు రూ.1,900 శ్రేణిలో ప్రవేశించి రూ.2,150 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.1,880 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
మూర్తి నాయుడు పాదం,
మార్కెట్ నిపుణులు, నిఫ్టీ మాస్టర్
+91 98855 59709
నోట్ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.
ఇవి కూడా చదవండి..
టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై రాళ్లు, కోడి గుడ్లతో దాడి
టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి.. ఖండించిన ఖర్గే