Share News

లాభాల్లోనే మార్కెట్లు

ABN , Publish Date - Nov 18 , 2026 | 05:37 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభాలతో ముగిశాయి. స్థిరమైన విదేశీ నిధుల ప్రవాహం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో...

లాభాల్లోనే మార్కెట్లు

సెన్సెక్స్‌ 427 పాయింట్లు అప్‌

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభాలతో ముగిశాయి. స్థిరమైన విదేశీ నిధుల ప్రవాహం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో మోస్తరు కదలికల నేపథ్యంలో బ్యాంకు షేర్లు, రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో బీఎస్ఈ సెన్సెక్స్‌ 427.40 పాయింట్లు పెరిగి 82,532.19 వద్ద ముగిసింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ ఏకంగా 792.7 పాయింట్లు పెరిగి 82,897.49 స్థాయిని తాకింది. ఇక ఎన్‌ఎస్ఈ నిఫ్టీ 96.30 పాయింట్ల లాభంతో 25,387.40 వద్ద క్లోజైంది. బ్యాంక్‌ నిఫ్టీ 1.13 శాతం పెరిగి రికార్డు స్థాయిలో 62,273.25 వద్ద క్లోజైంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్‌ బ్రెంట్‌ ముడి చమురు ధర ఒక దశలో 0.26 శాతం పెరిగి 92.68 డాలర్ల వద్ద ట్రేడయింది.

7 నెలల గరిష్ఠానికి రూపాయి: రూపాయి మరింత బలపడింది. మంగళవారం డాలర్‌ మారకంలో రూపాయి విలువ 43 పైసలు పెరిగి రూ.93.51 వద్ద క్లోజైంది. ఇది ఏడు నెలల గరిష్ఠ స్థాయి. మంగళవారం ఇంట్రాడే ట్రేడ్‌లో రూపాయి రూ.93.40 వద్ద గరిష్ఠ, రూ.93.73 కనిష్ఠ స్థాయిలను తాకింది. ఏప్రిల్‌ 21న రూపాయి 93.44 దగ్గర ముగిసింది.

ఏడాది కనిష్ఠానికి వెండి ధర: బంగారం, వెండి ధరలు మరింతగా దిగివచ్చాయి. ఢిల్లీ మార్కెట్లో పసిడి ధర వరుసగా ఆరో రోజూ తగ్గింది. మంగళవారం 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.1,400 తగ్గి రూ.1,38,600కు చేరుకుంది. కిలో వెండి ధర 5 శాతం పడిపోయి ఏడాది కనిష్ఠ స్థాయిని తాకింది. అంతర్జాతీయ మార్కెట్లో బలహీన సెంటిమెంట్‌, రూపాయి పెరుగుదల ఇందుకు కారణమవుతోంది. కిలో వెండి ధర ఏకంగా రూ.9,500 తగ్గి రూ.1,69,500కు చేరుకుంది. గత ఏడాది నవంబరు 13న కిలో వెండి ధర దాదాపు రూ.1.69 లక్షల స్థాయిలో ట్రేడయింది.

ఇవి కూడా చదవండి..

హోర్ముజ్ జలసంధిలో మరో నౌకపై దాడి.. ఒమన్ తీరానికి సమీపంలో ట్యాంకర్‌కు మంటలు..

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Nov 18 , 2026 | 05:38 AM