Stock Market Watch: ఆచితూచి అడుగేయండి..
ABN , Publish Date - Jan 05 , 2026 | 05:36 AM
దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి జీవితకాల గరిష్ఠ స్థాయిల్లో కదలాడుతున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లు నిలకడగా సాగుతున్నాయి. అయితే వెనిజువెలా ఉద్రిక్తత...
దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి జీవితకాల గరిష్ఠ స్థాయిల్లో కదలాడుతున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లు నిలకడగా సాగుతున్నాయి. అయితే వెనిజువెలా ఉద్రిక్తత మినహా మిగిలిన ఘర్షణలు స్తబ్దుగా మారాయి. ఈ వారం మెటల్, పీఎ్‌సయూ బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థలు, కమోడిటీస్, ఆటో, ఎనర్జీ, మీడియా రంగ షేర్లు పటిష్ఠతను కనబరిచే అవకాశం ఉంది. అయితే ఇన్వెస్టర్లు ఆచితూచి షేర్లను ఎంపిక చేసుకోవటం మంచిది.
స్టాక్ రికమండేషన్స్
ఇండియన్ బ్యాంక్: జీవితకాల గరిష్ఠాన్ని తాకిన తర్వాత 15 శాతం మేర దిద్దుబాటుకు లోనైన ఈ షేరు ప్రస్తుతం జోరు ప్రదర్శిస్తోంది. చివరి ఐదు ట్రేడింగ్ సెషన్లలో 12 శాతం మేర పెరిగింది. 10,20,50 మూవింగ్ యావరేజె్‌సను అధిగమించింది. గత శుక్రవారం రూ.861 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.850 శ్రేణిలో పొజిషన్ తీసుకుని రూ.925/940 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.840 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
పీఎ్‌ఫసీ: పదిహేను నెలల క్రితం జీవితకాల గరిష్ఠాన్ని తాకిన తర్వాత ఈ షేరు దాదాపు 45 శాతం మేర పతనమైంది. ప్రస్తుతం టర్న్ అరౌండ్ అవుతోంది. రిలేటివ్ స్ట్రెంత్, వాల్యూమ్ పెరుగుతోంది. గత శుక్రవారం రూ.375 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.365 శ్రేణిలో ఎంటరై రూ.425 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. స్టాప్‌లాస్ రూ.350.
హిందాల్కో: గత ఏడాది మే నుంచి ఈ షేరు అప్‌ట్రెండ్‌లో కొనసాగుతోంది. దాదాపు 65 శాతం మేర రాబడిని అందించింది. నిఫ్టీతో పోల్చితే జోరును ప్రదర్శిస్తోంది. గత శుక్రవారం రూ.925 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.920 శ్రేణిలో ప్రవేశించి రూ.965/980 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. స్టాప్‌లాస్ రూ.900.
హిందుస్థాన్ జింక్: గత సెప్టెంబరు నుంచి ఈ షేరు 50 శాతానికి పైగా పెరిగింది. ప్రస్తుతం దీర్ఘకాలిక అప్‌ట్రెండ్‌లో కొనసాగుతోంది. జీవితకాల గరిష్ఠం వైపు పరుగులు తీస్తోంది. గత శుక్రవారం రూ.628 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.601 వద్ద రూ.725 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. స్టాప్‌లాస్ రూ.600.
ఐఆర్‌ఈడీఏ: గత ఏడాది జూలై నుంచి ఈ షేరు భారీగా పతనమవుతూ వస్తోంది. ఏకంగా 57 శాతం మేర క్షీణించింది. ప్రస్తుతం కీలకమైన మద్దతు స్థాయి రూ.130 వద్ద టర్న్ అరౌండ్ అయ్యింది. రిలేటివ్ స్ట్రెంత్, వాల్యూమ్ గణనీయంగా పెరుగుతోంది. గత శుక్రవారం రూ.146 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.140 ఎగువన ప్రవేశించి రూ.160 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. స్టాప్‌లాస్ రూ.139.
మూర్తి నాయుడు పాదం,
మార్కెట్ నిపుణులు, నిఫ్టీ మాస్టర్
+91 98855 59709
నోట్ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొడుతున్న బీఆర్ఎస్ నేతలు: జగ్గారెడ్డి
ఫోన్ ట్యాపింగ్ కేసులో నవీన్ రావును ప్రశ్నిస్తున్న సిట్ అధికారులు
For More TG News And Telugu News