Share News

సావెరిన్ గోల్డ్ బాండ్స్ కొన్నవారి పంట పండిది.. లక్షకి.. రూ. 3.64 లక్షలు

ABN , Publish Date - Jan 21 , 2026 | 07:38 PM

బంగారం ధరలు భారీగా పెరిగిపోవడం కారణంగా సావెరిన్ గోల్డ్ బాండ్స్‌లో పెట్టుబడి పెట్టిన వారి పంట పండింది. నేటికి సరిగ్గా ఐదేళ్ల క్రితం రూ.1 లక్ష పెట్టుబడి పెట్టి సావెరిన గోల్డ్ బాండ్లు కొనుగోలు చేసిన వారికి ఇప్పుడు అక్షరాలా రూ.3.64 లక్షలు వస్తున్నాయి.

సావెరిన్ గోల్డ్ బాండ్స్ కొన్నవారి పంట పండిది.. లక్షకి.. రూ. 3.64 లక్షలు
Sovereign Gold Bonds

ఆంధ్రజ్యోతి, జనవరి 21: సావెరిన్ గోల్డ్ బాండ్స్ విడుదల చేసి ఇవాళ్టికి ఐదేళ్లు నిండడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సదరు గోల్డ్ బాండ్స్ ప్రీమెచ్యూర్ రిడంప్షన్ రేటు ప్రకటించింది. ప్రీమెచ్యూర్ రిడెంప్షన్ ధరను ఒక యూనిట్‌కు రూ. 14,432(గ్రాముకు సమానం)గా ఆర్బీఐ ప్రకటించింది.

జనవరి 21, 2020లో కేంద్ర ప్రభుత్వం సావెరిన్ గోల్డ్ బాండ్స్ సిరీస్ VIII ను ఇష్యూ చేసింది. అప్పట్లో అంటే, ఇవాళ్టికి సరిగ్గా ఐదేళ్ల క్రితం ఆన్‌లైన్లో బాండ్స్ కొన్నవారికి గ్రాము బంగారానికి రూ. 3,966 (రూ. 50 డిస్కౌంట్‌తో), ఆఫ్‌లైన్‌లో బాండ్స్ కొనుగోలు చేసిన వారికి రూ. 4,016 గా ధర నిర్ణయించి అమ్మకాలు జరిపారు.

ఇవాళ ఆర్బీఐ ప్రకటించిన బంగారం ధర ఒక యూనిట్ ప్రకారం చూస్తే.. గ్రాము బంగారంపై ప్రస్తుత రేటు రూ.14,432 - కొన్న ధర రూ.3,966.. లాభం రూ.10.466గా ఉంది. అంటే గ్రాము బంగారం కొన్నవారికి ఐదేళ్లలో రూ. 10,466 లాభం వచ్చినట్లైంది. అప్పట్లో రూ.1 లక్ష పెట్టి సావెరిన గోల్డ్ బాండ్లు కొనుగోలు చేసిన వారికి ఇప్పుడు రూ.3.64 లక్షలు వస్తాయన్న మాట.


ధరను ఎలా నిర్ణయించారు?

ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) ప్రకారం జనవరి 16, 19, 20 మూడు బిజినెస్ డేస్‌లలో గోల్డ్ క్లోజింగ్ ధరల సింపుల్ యావరేజ్ ఆధారంగా ఆర్బీఐ ఈ రిడెంప్షన్ రేటు నిర్ణయించింది.

అదనంగా 2.5% వడ్డీ

రిడెంప్షన్ వాల్యూతో పాటు అదనంగా, ఈ బాండ్లపై ప్రతి సంవత్సరం 2.5% వడ్డీ కూడా రిజర్వ్ బ్యాంక్ ఇస్తుంది. ఇది సగటున ఆ బ్యాలెన్స్‌పై సెమి-యాన్యువల్‌(ఏడాదికి రెండుసార్లు)గా క్రెడిట్ అవుతుంది.

మెచ్యూరిటీ:

సాధారణంగా సావెరిన్ గోల్డ్ బాండ్స్ మెచ్యూరిటీ కాలం 8 సంవత్సరాలు. కానీ 5 సంవత్సరాల తర్వాత ప్రీమెచ్యూర్ రిడెంప్షన్‌కు వడ్డీ చెల్లింపు తేదీల్లో అనుమతి ఉంటుంది (ఇంటరెస్ట్ పేమెంట్ డేస్‌లలో). బాండ్లు అమ్మేయాలనుకునే ఇన్వెస్టర్లు బ్యాంకు/పోస్ట్ ఆఫీస్/స్టాక్ బ్రోకర్ ద్వారా ప్రక్రియ పూర్తి చేయవచ్చు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆ దేశాలు సుంకాలను ఆయుధాలుగా వాడుతున్నాయి: కెనడా

ఇరాన్‌కు ట్రంప్ మళ్లీ వార్నింగ్.. కుట్ర చేశారో..

Updated Date - Jan 21 , 2026 | 08:18 PM