ఒక్క రోజే రూ.40,500 పెరిగిన వెండి
ABN , Publish Date - Jan 28 , 2026 | 01:58 AM
బులియన్ మార్కెట్ జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. మంగళవారం కిలో వెండి ధర కనివిని ఎరుగని రీతిలో రూ.40,500 పెరిగి సరికొత్త గరిష్ఠ స్థాయి...
కిలో రూ.3.7 లక్షలకు చేరిక
న్యూఢిల్లీ: బులియన్ మార్కెట్ జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. మంగళవారం కిలో వెండి ధర కనివిని ఎరుగని రీతిలో రూ.40,500 పెరిగి సరికొత్త గరిష్ఠ స్థాయి రూ.3.7 లక్షలకు చేరింది. వెండి ధర ఒకే రోజు ఇంత భారీగా పెరగడం ఇదే ప్రఽథమం. మేలిమి బంగారం (99.9ు స్వచ్ఛత) సైతం 10 గ్రాములు రూ.7,300 పెరిగి రూ.1.66 లక్షలను తాకాయి.
ఈక్విటీ మార్కెట్లో రికవరీ
మంగళవారం ఈక్విటీ మార్కెట్ రికవరీ బాటలో పయనించింది. సెన్సెక్స్ 319.78 పాయింట్ల లాభంతో 81,857.48 వద్ద, నిఫ్టీ 126.75 పాయింట్ల లాభంతో 25,175.40 వద్ద ముగిశాయి.. సెన్సెక్స్ ఇంట్రాడేలో 1000 పాయింట్ల మేరకు ఆటుపోట్లు చవి చూసింది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 22 పైసలు లాభపడి 91.68 వద్ద ముగిసింది.
Also Read:
ఎన్టీఆర్ భవన్‌లో పార్లమెంటరీ కమిటీల శిక్షణ.. ప్రధానంగా వాటిపైనే
అది టీడీపీ రక్తంలోనే లేదు.. అంతా చంద్రబాబు సైనికులమే: లోకేశ్
Read Latest AP News And Telugu News