మార్కెట్లో లాభాల స్వీకరణ
ABN , Publish Date - Oct 15 , 2026 | 06:07 AM
చమురు ధరల సెగ, టోకు ధరల పెరుగుదల నేపథ్యంలో మదుపరులు లాభాల స్వీకరణకు పాల్పడటంతో స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు బుధవారం మళ్లీ నష్టాల్లో...
సెన్సెక్స్ 252 పాయింట్లు డౌన్
ముంబై: చమురు ధరల సెగ, టోకు ధరల పెరుగుదల నేపథ్యంలో మదుపరులు లాభాల స్వీకరణకు పాల్పడటంతో స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు బుధవారం మళ్లీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 251.89 పాయింట్లు కోల్పోయి 72,781.89 వద్దకు జారుకోగా.. నిఫ్టీ 99.25 పాయింట్లు తగ్గి 22,622.70 వద్ద ముగిసింది. సెన్సెక్స్లోని 30 నమోదిత కంపెనీల్లో 19 నష్టపోగా.. బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు 2.55 శాతం వరకు క్షీణించాయి.
నెల గరిష్ఠానికి రూపాయి : గతవారంలో ఆర్బీఐ చేపట్టిన చర్యలతో భారత కరెన్సీ వరుసగా నాలుగో రోజూ బలపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ మరో 19 పైసలు లాభపడి నెల రోజుల గరిష్ఠ స్థాయి రూ.95.17 వద్ద ముగిసింది.
ఇవి కూడా చదవండి:
తన పని తాను చేశాడు.. ఫలితం వెతుక్కుంటూ వచ్చింది: అశ్విన్
ప్రయాణాన్ని కొత్తగా ప్రారంభిస్తున్నాం.. మళ్లీ ఒక్కటైన క్రికెటర్ పృథ్వీ షా-ఆకృతి
పోలీసుల దాడుల్లో ఓ విద్యార్థిని వినికిడి శక్తి కోల్పోయింది.. దీనికి బాధ్యులెవరు? : రాహుల్ గాంధీ