Share News

స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం.. మిడ్, స్మాల్ క్యాప్స్‌లో వరుసగా అమ్మకాలు..

ABN , Publish Date - Oct 23 , 2026 | 11:16 AM

దేశీయ స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ గరిష్ఠ స్థాయి నుంచి సుమారు 1,000 పాయింట్లకు పైగా పడిపోయింది.

స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం.. మిడ్, స్మాల్ క్యాప్స్‌లో వరుసగా అమ్మకాలు..
Sensex today

ఇంటర్నెట్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ గరిష్ఠ స్థాయి నుంచి సుమారు 1,000 పాయింట్లకు పైగా పడిపోయింది. నిఫ్టీ 22,500 పాయింట్ల దిగువకు చేరింది. ముఖ్యంగా మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో ప్రతిరోజు అమ్మకాల ఒత్తిడి కనబడుతోంది. దీంతో మిడ్, స్మాల్ సూచీలు భారీగా పతనమవుతున్నాయి (Sensex today).


మార్కెట్‌పై ఒత్తిడికి ప్రధాన కారణాల్లో ముడి చమురు ధరల పెరుగుదల ఒకటి. బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్‌కు 113 డాలర్లకు పైగా చేరడం ఆందోళన కలిగిస్తోంది. సౌదీ అరేబియాపై హౌతీ దాడుల నేపథ్యంలో ఇంధన సరఫరాకు అంతరాయం కలగవచ్చన్న భయాలు పెరిగాయి. దీంతో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. నిఫ్టీ 50 సూచీలో కొన్ని ప్రముఖ కంపెనీల షేర్లు పతనం సూచీలను వెనక్కి లాగుతోంది. ప్రధాన సూచీలతో పోలిస్తే మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి మరింత స్పష్టంగా కనిపించింది. నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీ 3 శాతానికి పైగా పడిపోగా, మిడ్‌క్యాప్ సూచీలు సుమారు 1.4 శాతం నష్టపోయాయి (stock market crash).


ఒకవైపు అమ్మకాల ఒత్తిడి కొనసాగుతున్నా, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FII) గురువారం భారత స్టాక్ మార్కెట్లో నికరంగా రూ.1,022 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు (Crude oil prices). దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (DII) కూడా రూ.1,614 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు. అయినప్పటికీ శుక్రవారం మార్కెట్లు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అంతర్జాతీయ పరిస్థితులు, చమురు ధరలు, షేర్లలో అమ్మకాల ధోరణి మార్కెట్ దిశను ప్రభావితం చేస్తున్నాయి.


ఇవి కూడా చదవండి..

టిబెట్‌లో భారీ భూకంపం.. 16 మంది మృతి, 32 మందికి గాయాలు..


మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Oct 23 , 2026 | 11:20 AM