Share News

రూ.9 లక్షల కోట్లు ఫట్‌

ABN , Publish Date - Sep 16 , 2026 | 06:02 AM

భారత స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు మంగళవారం భారీ నష్టాలను చవిచూశాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా పెరుగుతూ పోతున్న ముడిచమురు ధరలతోపాటు...

రూ.9 లక్షల కోట్లు ఫట్‌

  • చమురు ధరల పెరుగుదల, ఫెడ్‌ రేట్ల పెంపు

భయాలతో సెన్సెక్స్‌ 778 పాయింట్లు పతనం

  • 5 నెలల కనిష్ఠ స్థాయికి నిఫ్టీ

  • మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లు విలవిల.. ఐటీ జిగేల్‌

ముంబై: భారత స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు మంగళవారం భారీ నష్టాలను చవిచూశాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా పెరుగుతూ పోతున్న ముడిచమురు ధరలతోపాటు ఈవారంలో నిర్వహించనున్న పరపతి సమీక్షలో యూఎస్‌ ఫెడ్‌ రిజర్వ్‌ ప్రామాణిక వడ్డీ రేట్లను పెంచవచ్చన్న భయాలు ఇందుకు కారణమయ్యాయి. ఉదయం లాభాల్లో ట్రేడింగ్‌ ఆరంభించిన సెన్సెక్స్‌.. కొద్ది సేపటికే నష్టాల్లోకి మళ్లింది. ఆ తర్వాత నష్టాలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. చివరికి సూచీ 777.94 పాయింట్ల (1.04 శాతం) పతనంతో 3 నెలల కనిష్ఠ స్థాయి 74,003.82 వద్దకు జారుకుంది. నిఫ్టీ 279.50 పాయింట్లు (1.19 శాతం) క్షీణించి 5 నెలల కనిష్ఠ స్థాయి 23,118.60 వద్ద ముగిసింది. ఈక్విటీ వర్గాల సంపదగా భావించే బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.9.17 లక్షల కోట్లు తగ్గి రూ.472.38 లక్షల కోట్లకు (4.92 లక్షల కోట్ల డాలర్లు) పడిపోయింది. మార్కెట్‌ సంపద 5 లక్షల కోట్ల డాలర్ల కంటే తగ్గడం ఈ జూన్‌ తర్వాత మళ్లీ ఇదే మొదటిసారి.

  • సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 23 నష్టపోగా.. భారత్‌ ఎలకా్ట్రనిక్స్‌ షేరు 6.04 శాతం క్షీణించి సూచీ టాప్‌ లూజర్‌గా మిగిలింది. ఇండిగో, టైటన్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, అదానీ పోర్ట్స్‌ షేర్లు 3 శాతానికి పైగా తగ్గాయి. బీఎ్‌సఈలోని మిడ్‌క్యాప్‌ సెలెక్ట్‌, స్మాల్‌క్యాప్‌ సెలెక్ట్‌ సూచీలు 2.50 శాతం వరకు పతనమయ్యాయి.

  • అమెరికన్‌ కృత్రిమ మేధ(ఏఐ) కంపెనీలు తమ టెక్నాలజీ అభివృద్ధి వేగాన్ని తగ్గించిన నేపథ్యంలో సంప్రదాయ ఐటీ సేవల కంపెనీల షేర్లలో కొనుగోళ్లు పెరిగాయి. హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌ స్టాక్స్‌ 3.98 శాతం వరకు పుంజుకున్నాయి.

  • కొత్త సీఈఓ నియామకం కోసం హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ బోర్డు ఇద్దరి పేర్లను ఆర్‌బీఐకి పంపిన నేపథ్యంలో బ్యాంక్‌ షేరు ఒకదశలో 3.14 శాతం ఎగబాకినప్పటికీ, చివరికి 1.27 శాతం లాభంతో రూ.717 వద్ద ముగిసింది.

  • టాటా సన్స్‌ ఎన్‌బీఎ్‌ఫసీ లైసెన్సు రద్దు దరఖాస్తును ఆర్‌బీఐ తిరస్కరించిన నేపథ్యంలో కంపెనీ పెట్టుబడులు కలిగిన టాటా గ్రూప్‌ షేర్లు భారీగా పుంజుకున్నాయి. అందులో టాటా కెమికల్స్‌ అత్యధికంగా 20 శాతం, టాటా ఇన్వె్‌స్టమెంట్‌ కార్పొరేషన్‌ 15.24 శాతం ఎగబాకాయి. ఎందుకంటే, ఆర్‌బీఐ తిరస్కరణతో టాటా సన్స్‌ కూడా మార్కెట్లో లిస్ట్‌ కావడం తప్పనిసరి కానుంది.


5 వారాల కనిష్ఠానికి బంగారం

దేశీయంగా విలువైన లోహాల ధరలు మరింత తగ్గాయి. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత బంగారం 10 గ్రాముల ధర మరో రూ.1,000 తగ్గి 5 వారాల కనిష్ఠ స్థాయి రూ.1,54,400కు దిగివచ్చింది. కిలో వెండి మాత్రం ఏ మార్పు లేకుండా రూ.2,34,600 ధర పలికింది.

రూపీ ఫాల్‌.. 110 డాలర్లకు చేరువలో క్రూడ్‌

డాలర్‌తో రూపాయి మారకం విలువ 34 పైసలు క్షీణించి రూ.95.88 వద్ద ముగిసింది. ముడిచమురు ధరల పెరగుదల, ఈక్విటీ మార్కెట్లో నష్టాలు, దిగుమతిదారుల నుంచి డాలర్లకు పెరిగిన డిమాండ్‌ ఇందుకు కారణమయ్యాయి. కాగా, అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ ముడిచమురు పీపా ధర ఒకదశలో 3 శాతానికి పైగా ఎగబాకి 109.2 డాలర్ల వద్ద ట్రేడైంది.

స్టాక్‌ మార్కెట్‌పైనా

ఎండీఆర్‌ చార్జీల ఎఫెక్ట్‌!

రూ.2,000 కంటే విలువైన యూపీఐ లావాదేవీలపై మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ మ(ఎండీఆర్‌) చార్జీలు విధించాలన్న నిర్ణయం స్టాక్‌ మార్కెట్లో లావాదేవీలపై స్వల్పకాలికంగా ప్రభావం చూపవచ్చని ఎన్‌ఎ్‌సఈ మంగళవారం అభిప్రాయపడింది. ఆ తర్వాత లావాదేవీలు మళ్లీ సాధారణ స్థాయికి పుంజుకోవచ్చని ఎన్‌ఎ్‌సఈ ఎండీ, సీఈఓ ఆశిష్‌ కుమార్‌ చౌహాన్‌ అన్నారు.

ఇవి కూడా చదవండి:

అఫ్గాన్‌తో రెండో టీ20: టాస్ నెగ్గిన భారత్.. జట్టులోకి కొత్త ప్లేయర్

వెస్టిండీస్‌తో సిరీస్.. వన్డే జట్టులో పంత్, హార్దిక్ పాండ్యలకు చోటు?

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 16 , 2026 | 06:02 AM