గీత దాటితే పెనాల్టీ!
ABN , Publish Date - Mar 17 , 2026 | 02:20 AM
దేశంలో మదుపరుల సంఖ్య వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో రిజిస్టర్డ్ పెట్టుబడి సలహాదారుల (ఐఏ) వ్యవస్థను బలోపేతం చేసేందుకు అవసరమైన పలు చర్యలపై కసరత్తు జరుగుతోందని...
రిజిస్టర్డ్ పెట్టుబడి సలహాదారులు
సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే
న్యూఢిల్లీ: దేశంలో మదుపరుల సంఖ్య వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో రిజిస్టర్డ్ పెట్టుబడి సలహాదారుల (ఐఏ) వ్యవస్థను బలోపేతం చేసేందుకు అవసరమైన పలు చర్యలపై కసరత్తు జరుగుతోందని క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే తెలిపారు. ఇందులో భాగంగా ఏఐలకు ప్రామాణిక పెనాల్టీ విధానం, డిజిటల్ గైడెన్స్ ప్లాట్‌ఫామ్‌తో పాటు కామన్ అడ్వర్టైజ్‌మెంట్ కోడ్‌ను ప్రవేశపెట్టనున్నట్లు ఆయన చెప్పారు. అసోసియేషన్ ఆఫ్ రిజిస్టర్డ్ ఇన్వె్‌స్టమెంట్ అడ్వైజర్స్ (ఏఆర్‌ఐఏ) ఆధ్వర్యంలో సోమవారం జరిగిన ఆస్పైర్ 2026 కార్యక్రమంలో ప్రసంగిస్తూ పాండే ఈ విషయాన్ని వెల్లడించారు. మదుపరులకు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా పెట్టుబడి సలహాలిచ్చేందుకు ఏఐలు కట్టుబడి ఉండేదుకే అంతగా కఠినం కాని పెనాల్టీ విధానాన్ని తీసుకురాబోతున్నట్లు సెబీ చీఫ్ పేర్కొన్నారు. అలాగే, రిజిస్ట్రేషన్ నుంచి నిబంధనల పాటింపు వరకు ఐఏలకు నియంత్రణ మండలి నుంచి సమగ్ర మార్గదర్శకత్వం కోసం సెబీ సేతు పేరుతో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పా రు. అంతేకాదు, మార్కెట్ ఇంటర్మీడియేటరీ సంస్థల కోసం కామన్ అడ్వర్టైజ్‌మెంట్ కోడ్‌ను రూపొందిస్తున్నామన్నారు. ఈ కోడ్ నిర్వహణ పరమైన సవాళ్లను తగ్గించడంతో పాటు ఆర్థిక సేవల పథకాలు, సాధనాల ప్రచారంలో నిలకడకు తోడ్పడనుందన్నారు. పాండే ఇంకా ఏమన్నారంటే..
పెట్టుబడి సలహాలిచ్చే వ్యక్తుల కోసం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్ (ఎన్‌ఐఎ్‌సఎం) ద్వారా సరళమైన సర్టిఫికెట్ మాడ్యూల్‌ను అభివృద్ధి చేస్తున్నాం.
మరింత మంది అర్హులైన వారు రిజిస్టర్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ల పరిధిలోకి వచ్చేందుకు సెబీ ప్రయత్నాలు చేస్తోంది. ఏఆర్‌ఐఏ కూడా ఈ దిశగా కృషి చేయాలి.
ప్రస్తుతం దేశంలో దాదాపు 1,000 రిజిస్టర్డ్ ఐఏలు ఉన్నారు. అందులో 470 మంది వ్యక్తులు కాగా.. మిగతా 530 ఇన్వె్‌స్టమెంట్ అడ్వైజరీ సంస్థలు. గడిచిన కొన్నేళ్లలో (2021 నుంచి) రిజిస్టర్డ్ ఐఏల సంఖ్య గణనీయంగా తగ్గింది. రిజిస్టర్డ్ ఐఏల సంఖ్య పెరగకపోతే పెట్టుబడి సలహాల్లో అనియంత్రిత ఫిన్‌ఫ్లుయెన్సర్ల ప్రభావం పెరిగే ప్రమాదం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. కఠిన చర్యలు తప్పవు: ఈగల్ ఎస్పీ గిరిధర్
రేవంత్‌రెడ్డి జూనియర్ యోగిలా మారారు.. హరీశ్‌రావు సెటైర్లు
ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ గుట్టురట్టు.. 11 మంది అరెస్ట్
Read Latest Telangana News And AP News And International News And Telugu News