Share News

ప్రపంచంలో అత్యుత్తమ బ్యాంక్‌గా ఎస్‌బీఐ

ABN , Publish Date - Oct 18 , 2026 | 05:46 AM

దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)కి అంతర్జాతీయ స్థాయిలో మరోసారి గుర్తింపు లభించింది...

ప్రపంచంలో అత్యుత్తమ బ్యాంక్‌గా ఎస్‌బీఐ

న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)కి అంతర్జాతీయ స్థాయిలో మరోసారి గుర్తింపు లభించింది. గ్లోబల్‌ ఫైనాన్స్‌ మ్యాగజైన్‌ ప్రకటించిన ‘వరల్డ్స్‌ బెస్ట్‌ కన్స్యూమర్‌ బ్యాంక్‌ - 2026’ అవార్డును వరుసగా రెండో ఏడాది ఎస్‌బీఐ గెలుచుకుంది. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరిగిన ఐఎంఎఫ్‌ వార్షిక సమావేశం సందర్భంగా ఈ పురస్కారాన్ని అందజేశారు. డిజిటల్‌ ఆవిష్కరణలు, నాణ్యమైన బ్యాంకింగ్‌ సేవల విస్తరణ, అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక సేవలను చేరువ చేయడంలో బ్యాంక్‌ చూపుతున్న నిబద్ధతకు ఈ అవార్డు నిదర్శనమని ఎస్‌బీఐ చైర్మన్‌ చల్లా శ్రీనివాసులు శెట్టి తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..

స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. కూటమి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు

మహిళలు స్వయంకృషితో ఎదిగేందుకు ఎన్టీఆర్‌ ట్రస్ట్ చేయూత: నారా భువనేశ్వరి

ద్వారకా తిరుమలలో 21 నుంచి 28 వరకు బ్రహ్మోత్సవాలు

Read Latest AP News And Telangana News And National News

Updated Date - Oct 18 , 2026 | 05:46 AM