Share News

ఎస్‌బీఐ ఉద్యోగుల సమ్మె హెచ్చరిక

ABN , Publish Date - May 22 , 2026 | 02:41 AM

తమ డిమాండ్లకు ఒప్పుకోకపోతే వచ్చే సోమవారం నుంచి రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా సమ్మె తప్పదని...

ఎస్‌బీఐ ఉద్యోగుల సమ్మె హెచ్చరిక

న్యూఢిల్లీ: తమ డిమాండ్లకు ఒప్పుకోకపోతే వచ్చే సోమవారం నుంచి రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా సమ్మె తప్పదని ఎస్‌బీఐ ఉద్యోగుల సంఘం ప్రకటించింది. మెసెంజర్లు, ఆర్మ్‌డ్‌ గార్డుల నియామకంతో పాటు ఎన్‌పీఎ్‌సలో పెన్షన్‌ ఫండ్‌ మేనేజర్‌ను మార్చుకునే ఆప్షన్‌ కావాలని ఎస్‌బీఐ ఉద్యోగులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. అలాగే పర్మినెంట్‌ ఉద్యోగులు చేయాల్సిన కొన్ని కీలక బాధ్యతలను ఔట్‌సోర్సింగ్‌కు అప్పగించడాన్నీ, బ్యాంకు బోర్డులో ఉద్యోగుల ప్రతినిధి నియామకంపై మేనేజ్‌మెంట్‌ జాప్యం చేయడాన్ని వారు తప్పుపడుతున్నారు. మేనేజ్‌మెంట్‌ ఈ డిమాండ్లపై దిగిరాకపోతే సోమవారం నుంచి రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా సమ్మె తప్పదని అఖిల భారత ఎస్‌బీఐ ఉద్యోగుల సమాఖ్య గురువారం హెచ్చరించింది. ఈ సమ్మె ప్రారంభమైతే ఈ శనివారం నుంచి ఐదు రోజుల పాటు దేశవ్యాప్తంగా ఎస్‌బీఐ కార్యకలాపాలు నిలిచిపోతాయి. బ్యాంకింగ్‌ ఉద్యోగులకు ప్రతి నెల రెండు, నాలుగో శనివారాలు సెలవు. వచ్చే బుధవారం బక్రీద్‌ సందర్భంగా అనేక రాష్ట్రాల్లో సెలవు ప్రకటించారు. దీంతో ఈ శనివారం నుంచి వచ్చే బుధవారం వరకు ఎస్‌బీఐ శాఖలు మూతపడే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి...

దళిత డ్రైవర్ హత్య కేసు.. రాజమండ్రి కోర్టులో రెండో రోజు విచారణ

కిరీటం మాయంపై విచారణ.. అందుబాటులోని లేని ట్రస్ట్‌ సభ్యులు.. ఏసీ ఆగ్రహం

Read Latest AP News And Telugu News

Updated Date - May 22 , 2026 | 02:41 AM