Share News

2030 నాటికి ఏఐ నైపుణ్యాల్లో 10 లక్షల మందికి శిక్షణ

ABN , Publish Date - Jun 10 , 2026 | 03:25 AM

అంతర్జాతీయ టెక్‌ దిగ్గజ సంస్థ సేల్స్‌ఫోర్స్‌.. కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత నైపుణ్యాల్లో శిక్షణను అందించటంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా 2030 నాటికి భారత్‌లో...

2030 నాటికి ఏఐ నైపుణ్యాల్లో 10 లక్షల మందికి శిక్షణ

సేల్స్‌ఫోర్స్‌ ప్రెసిడెంట్‌ అరుంధతీ భట్టాచార్య

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అంతర్జాతీయ టెక్‌ దిగ్గజ సంస్థ సేల్స్‌ఫోర్స్‌.. కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత నైపుణ్యాల్లో శిక్షణను అందించటంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా 2030 నాటికి భారత్‌లో 10 లక్షల మంది లెర్నర్స్‌కు ఏఐ ఆధారిత నైపుణ్యాల్లో శిక్షణను అందించనున్నట్లు సేల్స్‌ఫోర్స్‌ (దక్షిణాసియా) ప్రెసిడెంట్‌, సీఈఓ అరుంధతీ భట్టాచార్య వెల్లడించారు. మంగళవారం నాడిక్కడ హైదరాబాద్‌లోని సేల్స్‌ఫోర్స్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (సీఓఈ) పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏఐ-రెడీ నైపుణ్యాల్లో కొత్త తరాన్ని సిద్ధం చేసేందుకు భారత ప్రభుత్వ ఏఐ నైపుణ్య కార్యక్రమం ‘ఇండియాఏఐ’, కేంద్ర ఎలకా్ట్రనిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖతో కలిసి పనిచేయనున్నట్లు చెప్పారు. అలాగే ఏఐసీటీఈతో కలిసి వర్చువల్‌ ఇంటర్న్‌షిప్‌ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు భట్టాచార్య తెలిపారు. దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో ఉన్న విద్యార్థులకు ప్రాజెక్ట్‌ అనుభవాన్ని అందుబాటులోకి తీసుకురావటంతో పాటు ఉద్యోగానికి సిద్ధమయ్యేలా తీర్చిదిద్దనున్నట్లు ఆమె పేర్కొన్నారు. అలాగే మణిపాల్‌ అకాడమీ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ సహా మరికొన్ని ఇన్‌స్టిట్యూషన్స్‌తో సేల్స్‌ఫోర్స్‌ అకాడమిక్‌ సెంటర్స్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ పనిచేయనుందన్నారు. ఏఐతో కొన్ని విభాగాల్లో ఉద్యోగాలు పోయినా మరికొన్ని విభాగాల్లో పెద్దఎత్తున కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని భట్టాచార్య తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి...

గుజరాత్‌కు ఎన్నాళ్లు గులాంలుగా ఉంటారు?: సీఎం రేవంత్‌

ప్రతి నియోజకవర్గంలో అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం: భట్టి విక్రమార్క

Read Latest Telangana News And AP News And National News

Updated Date - Jun 10 , 2026 | 03:25 AM