Share News

సాగర్‌ సిమెంట్స్‌తో సో అండ్‌ రీప్‌ ఒప్పందం

ABN , Publish Date - Jan 22 , 2026 | 05:44 AM

సాగర్‌ సిమెంట్స్‌.. తెలంగాణలోని తన మట్టంపల్లి ప్లాంట్‌ వద్ద బయోచార్‌, గ్యాసిఫికేషన్‌ యూనిట్లు ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం సో అండ్‌ రీప్‌ చరా అనే కంపెనీతో...

సాగర్‌ సిమెంట్స్‌తో సో అండ్‌ రీప్‌ ఒప్పందం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): సాగర్‌ సిమెంట్స్‌.. తెలంగాణలోని తన మట్టంపల్లి ప్లాంట్‌ వద్ద బయోచార్‌, గ్యాసిఫికేషన్‌ యూనిట్లు ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం సో అండ్‌ రీప్‌ చరా అనే కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా సో అండ్‌ రీప్‌ చరా కంపెనీ ఈ యూనిట్లు ఏర్పాటు చేస్తుంది. ఈ బయోచార్‌, గ్యాసిఫికేషన్‌ కోసం పత్తి కాడల వంటి వ్యవసాయ వ్యర్ధాలను ఉపయోగిస్తారు. దీనివల్ల సిమెంట్‌ ప్లాంటులో వాతావరణ కాలుష్యానికి దారితీసే శిలాజ ఇంధన వినియోగం తగ్గుతుందని రెండు కంపెనీలు తెలిపాయి. వీటి ద్వారా ఉత్పత్తి అయ్యే బొగ్గు పొడిని రైతులకు ఎరువుగా సరఫరా చేయనున్నారు.

ఇవి కూడా చదవండి..

కాకినాడ పీబీసీ కాల్వలో స్పిరిట్ లారీ బోల్తా.. ప్రజలకు అధికారుల హెచ్చరికలు

భారత్, ఇజ్రాయెల్ ఆర్థిక సహకారానికి దావోస్ వేదిక: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 22 , 2026 | 05:44 AM