Rs. 2000 Notes: రూ. 2000 నోట్లు ఇంట్లో ఉంచుకోవడం చట్టవిరుద్ధమా? RBI ఏమంటోంది?
ABN , Publish Date - Jan 04 , 2026 | 07:46 PM
చెలామణీ నుంచి రద్దు చేసిన రూ. 2000 వేల నోట్లు మీ ఇంట్లో ఇప్పటికీ ఉన్నాయా? అయితే, వీటిని ఇంట్లో ఉంచుకోవడం చట్టరిత్యా నేరమా? లేక, వీటిని క్యాష్ చేసుకోవచ్చా.. ఈ మార్పిడికి సంబంధించి ఆర్బీఐ ఏమంటోంది?
ఆంధ్రజ్యోతి, జనవరి 4: కేంద్రం నిషేధించిన రూ.2000 నోట్లు ఇంట్లో ఉంచుకున్నవారు భయపడాల్సిన అవసరం లేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దీనికి సంబంధించి స్పష్టంగా చెబుతోంది. రూ.2000 నోట్లు ఇప్పటికీ చట్టబద్ధమైన డబ్బు (లీగల్ టెండర్)గానే ఉన్నాయి. 2023 మేలో సర్కులేషన్ నుంచి విత్‌డ్రా చేసినప్పటికీ, ఇవి డీమానిటైజేషన్ కాదు. కావున హోల్డింగ్‌పై ఎలాంటి శిక్ష లేదు.
2026 జనవరి ప్రకారం, 98.41 శాతం రూ.2000 నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చాయి. మిగిలినవి (సుమారు రూ.5,669 కోట్లు) ఇప్పటికీ ప్రజల వద్ద ఉన్నాయి. ఈ నోట్లను నగదుగా మార్చుకోవచ్చు.
ఎక్స్చేంజ్ ఎలా చేయాలి?
సాధారణ బ్యాంకుల్లో 2023 అక్టోబర్ 7 తర్వాత సౌకర్యం మూసివేశారు. ఇప్పుడు RBI కి చెందిన 19 ఇష్యూ ఆఫీసుల్లో డిపాజిట్ లేదా ఎక్స్చేంజ్ చేయవచ్చు.. వీటి గుర్తింపు తర్వాత బ్యాంక్ అకౌంట్‌లో అంతే మొత్తం క్రెడిట్ చేస్తారు. ఇండియా పోస్ట్ ద్వారా ఏ పోస్టాఫీసు నుంచైనా RBI ఆఫీసుకు పంపినా సరే అదే మొత్తం మీ అకౌంట్ కి క్రెడిట్ చేస్తారు.
RBI ఈ చర్యను 'కరెన్సీ మేనేజ్‌మెంట్' కింద తీసుకుంది. భవిష్యత్తులో ఏ మార్పూ లేకపోతే, ఈ నోట్లు చట్టబద్ధంగానే ఉంటాయి. అప్పటి వరకూ వీటిని సొమ్ము చేసుకునే సౌకర్యం కూడా ఉంటుంది!
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొడుతున్న బీఆర్ఎస్ నేతలు: జగ్గారెడ్డి
ఫోన్ ట్యాపింగ్ కేసులో నవీన్ రావును ప్రశ్నిస్తున్న సిట్ అధికారులు
For More TG News And Telugu News