Share News

మార్కెట్లోకి రోచే టీసెంట్రిక్‌ ఎస్‌సీ ఔషధం

ABN , Publish Date - May 15 , 2026 | 04:11 AM

స్విస్‌ ఫార్మా దిగ్గజం రోచే.. ఊపిరితిత్తుల క్యాన్సర్‌ చికిత్సలో ఉపయోగించే టీసెంట్రిక్‌ ఎస్‌సీ (అటెజొలిజుమాబ్‌)...

మార్కెట్లోకి  రోచే టీసెంట్రిక్‌ ఎస్‌సీ ఔషధం

ఊపిరితిత్తుల క్యాన్సర్‌ చికిత్సలో వినియోగం

న్యూఢిల్లీ: స్విస్‌ ఫార్మా దిగ్గజం రోచే.. ఊపిరితిత్తుల క్యాన్సర్‌ చికిత్సలో ఉపయోగించే టీసెంట్రిక్‌ ఎస్‌సీ (అటెజొలిజుమాబ్‌) ఇంజక్షన్‌ను భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది. చికిత్స సమయాన్ని గణనీయంగా తగ్గించే ఈ ఇంజక్షన్‌ ధర రూ.3.7 లక్షలు. భారత్‌లో ఏటా 80,000 మంది ఈ క్యాన్సర్‌ బారిన పడుతున్నారని, అలాంటి వారికి ఈ ఔషధం ఎంతగానో ఉపకరిస్తుందని రోచే ఫార్మా ఇండియా ఎండీ, సీఈఓ రజ్వీందర్‌ మెహద్వాన్‌ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 85కు పైగా దేశాల్లో దాదాపు 10,000 మంది రోగులు ఈ ఔషధంతో ప్రయోజనం పొందినట్లు కంపెనీ వెల్లడించింది.

ఈ వార్తలు కూడా చదవండి...

టూరిజం, టెంపుల్ కారిడార్లపై సీఎం ప్రత్యేక ప్రణాళిక

సోషల్ మీడియాలో నిబంధనలు మీరితే కఠిన చర్యలు.. డీజీపీ వార్నింగ్

పోలీసులకు బండి భగీరథ్ లేఖ.. మే 15న విచారణకు హాజరవుతా

Read Latest Telangana News And AP News And International News

Updated Date - May 15 , 2026 | 04:11 AM