Share News

సామ్‌సంగ్‌కు రిలయన్స్‌ గ్రీన్‌ అమ్మోనియా

ABN , Publish Date - Mar 17 , 2026 | 01:24 AM

దక్షిణ కొరియాకు చెందిన సామ్‌సంగ్‌ సీ అండ్‌ టీ కార్పొరేషన్‌కు 15 ఏళ్ల పాటు గ్రీన్‌ అమ్మోనియా సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌...

సామ్‌సంగ్‌కు రిలయన్స్‌ గ్రీన్‌ అమ్మోనియా

డీల్‌ విలువ 300 కోట్ల డాలర్లు

న్యూఢిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన సామ్‌సంగ్‌ సీ అండ్‌ టీ కార్పొరేషన్‌కు 15 ఏళ్ల పాటు గ్రీన్‌ అమ్మోనియా సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) ప్రకటించింది. ఈ డీల్‌ విలువ 300 కోట్ల డాలర్ల (సుమారు రూ.27,600 కోట్లు) వరకు ఉంటుందని తెలిపింది. 2028-29 ఆర్థిక సంవత్సరం రెండో అర్థ భాగం నుంచి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఈ గ్రీన్‌ అమ్మోనియాను సామ్‌సంగ్‌కు సరఫరా చేయనుంది. పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా రిలయన్స్‌ ఈ గ్రీన్‌ అమ్మోనియాను ఉత్పత్తి చేయనుంది. ఈ గ్రీన్‌ అమ్మోనియాను ఎరువుగా, ఇండస్ట్రియల్‌ కెమికల్‌గా లేదా విద్యుత్‌ ఉత్పత్తి, నౌకా రవాణాలో ఇంధనంగానూ ఉపయోగించవచ్చు. దీర్ఘకాలిక గ్రీన్‌ అమ్మోనియా సరఫరా కోసం ప్రపంచంలో కుదిరిన అతిపెద్ద ఒప్పందం ఇదేనని ఆర్‌ఐఎల్‌ తెలిపింది.

ఈ వార్తలు కూడా చదవండి..

మొయినాబాద్‌ డ్రగ్స్ కేసు.. కఠిన చర్యలు తప్పవు: ఈగల్‌ ఎస్పీ గిరిధర్‌

రేవంత్‌రెడ్డి జూనియర్ యోగిలా మారారు.. హరీశ్‌రావు సెటైర్లు

ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ గుట్టురట్టు.. 11 మంది అరెస్ట్

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Mar 17 , 2026 | 01:24 AM