Share News

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు

ABN , Publish Date - Apr 25 , 2026 | 02:31 AM

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌కు జారీ చేసిన బ్యాంకింగ్‌ లైసెన్స్‌ను భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) రద్దు చేసింది. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌...

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు

ముంబై: పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌కు జారీ చేసిన బ్యాంకింగ్‌ లైసెన్స్‌ను భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) రద్దు చేసింది. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ కార్యకలాపాలు నిబంధనలకు అనుగుణంగా లేకపోవటంతో పాటు బ్యాంక్‌ డిపాజిటర్ల హక్కులను సక్రమంగా పరిరక్షించే విధంగా లేకపోవటంతో లైసెన్సును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా ఇకపై ఎలాంటి బ్యాంకింగ్‌ వ్యాపార కార్యకలాపాలు చేపట్టకుండా నిషేధం విధిస్తున్నట్లు పేర్కొంది. అలాగే బ్యాంక్‌ వ్యాపారాన్ని పూర్తిగా మూసివేయాలంటూ హైకోర్టుకు దరఖాస్తును సమర్పించనున్నట్లు తెలిపింది. ఖాతాదారుల డిపాజిట్‌ సొమ్మును తిరిగి చెల్లించేందుకు బ్యాంక్‌ వద్ద సరిపడినంత నగదు నిల్వలు ఉన్నాయని పేర్కొంది. కాగా 2022 మార్చి 11 నుంచి పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌.. కొత్త ఖాతాదారులను చేర్చుకోకుండా ఆర్‌బీఐ నిషేధం విధించింది.

ఈ వార్తలు కూడా చదవండి...

ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్.. హనీట్రాప్ ముఠా సంచలనం

శబరిమల కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

బాలికల కాలేజీలో కోఎడ్యుకేషన్ ఏర్పాటుపై హైకోర్టు అసంతృప్తి

Read Latest AP News And Telangana News And International News

Updated Date - Apr 25 , 2026 | 02:31 AM