Share News

రామ్‌కీ ఇన్‌ఫ్రా లాభంలో 36 శాతం వృద్ధి

ABN , Publish Date - Nov 08 , 2026 | 04:01 AM

రామ్‌కీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌.. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రూ.604.54 కోట్ల కన్సాలిడేటెడ్‌ ఆదాయంపై...

రామ్‌కీ ఇన్‌ఫ్రా లాభంలో 36 శాతం వృద్ధి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): రామ్‌కీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌.. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రూ.604.54 కోట్ల కన్సాలిడేటెడ్‌ ఆదాయంపై రూ.102.81 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే లాభం 35.9 శాతం వృద్ధి చెందగా ఆదాయం 28.2 శాతం పెరిగింది. ఇండస్ట్రియల్‌ పార్కులు, వాటర్‌, వేస్ట్‌వాటర్‌, అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై మరింత దృష్టి సారించటంతో మంచి పనితీరును కనబరిచినట్లు రామ్‌కీ తెలిపింది. మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరిస్తుండటంతో రానున్న రోజుల్లో మరింత వృద్ధి పథంలోకి సాగే అవకాశం ఉందని భావిస్తున్నట్లు పేర్కొంది. కాగా స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన కంపెనీ రూ.538.94 కోట్ల ఆదాయంపై రూ.75.98 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. సెప్టెంబరు ముగిసే నాటికి కంపెనీ ఆర్డర్‌ బుక్‌ రూ.12,000 కోట్లకు పైబడి ఉందని తెలిపింది.

ఈ వార్తలు కూడా చదవండి..

గ్లాండ్‌ ఫార్మా లాభం రూ.291 కోట్లు

ధనత్రయోదశి అదుర్స్‌

For More Business News And Telugu News

Updated Date - Nov 08 , 2026 | 04:01 AM