Share News

పులికాట్ సరస్సుకు కేంద్రం ప్రాధాన్యం: మంత్రి నిర్మలమ్మ

ABN , Publish Date - Feb 01 , 2026 | 12:08 PM

దేశంలో పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అందుకోసం జాతీయ పర్యాటక రంగ సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

పులికాట్ సరస్సుకు కేంద్రం ప్రాధాన్యం: మంత్రి నిర్మలమ్మ

  • పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తాం: ఆర్థిక మంత్రి నిర్మల

  • జాతీయ పర్యాటక రంగ సంస్థ ఏర్పాటు: నిర్మల

  • 20 పర్యాటక ప్రాంతాల్లో 10వేల మంది గైడ్‌ల నియామకం

  • పులికాట్‌ పక్షులను వీక్షించేందుకు ప్రత్యేక సౌకర్యాలు: నిర్మల

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 01: దేశంలో పర్యాటక రంగానికి పెద్ద పీట వేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అందుకోసం జాతీయ పర్యాటక రంగ సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ నెల్లూరు జిల్లాలోని పులికాట్ సరస్సుకు కేంద్రం ప్రాధాన్యం ఇస్తుందన్నారు. పులికాట్‌ సరస్సుకు వలస వచ్చే పక్షులను వీక్షించేందుకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వివరించారు. పర్యాటకాన్ని, జీవవైవిధ్యాన్ని ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని పులికాట్ సరస్సు వెంబడి పక్షులు వీక్షించే మార్గాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. దేశంలోని 20 పర్యాటక ప్రాంతాల్లో 10 వేల మంది గైడ్‌లను నియమిస్తామని పేర్కొన్నారు. 15 పురావస్తు ప్రాంతాలను అభివృద్ధిపరస్తామన్న మంత్రి.. తొలి గ్లోబల్ బిగ్ క్యాట్ సమ్మిట్‌కు భారత్‌ ఆతిథ్యం ఇవ్వనుందని ప్రకటించారు. ఈ సదస్సులో 95 దేశాలకు చెందిన ప్రభుత్వ అధినేతలతో పాటు మంత్రులు కూడా పాల్గొంటారని వివరించారు.


ఆంధ్రప్రదేశ్, సిక్కిం, మిజోరాం, త్రిపురలలో బుద్ధిస్ట్ సర్కూట్‌ను అభివ‌ద్ధి చేసేందుకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఇక సూక్ష్మ పరిశ్రమలకు రూ. 2 వేల కోట్లు కేటాయింపులు జరిపినట్లు చెప్పారు. స్వయం సమృద్ధ భారతం పేరుతో రూ. 2 వేల కోట్ల ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ కొనుగోలు ద్వారా MSMEలకు చేయూత అందిస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు.

Updated Date - Feb 01 , 2026 | 02:25 PM