Share News

ప్రభుత్వరంగ బ్యాంకుల పనితీరు భేష్‌!

ABN , Publish Date - Nov 27 , 2026 | 03:24 AM

ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) మెరుగైన ఆర్థిక ఫలితాలు సాధిస్తున్నాయి. రుణాల మంజూరులో...

ప్రభుత్వరంగ బ్యాంకుల పనితీరు భేష్‌!

రికార్డు స్థాయికి రుణ వృద్ధి.. 0.33 శాతానికి ఎన్‌పీఏలు

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) మెరుగైన ఆర్థిక ఫలితాలు సాధిస్తున్నాయి. రుణాల మంజూరులో అప్రమత్తత, మెరుగైన రిస్క్‌ నిర్వహణ చర్యలతో నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) చారిత్రక కనిష్ఠ స్థాయికి తగ్గుముఖం పట్టాయి. 2026 సెప్టెంబరు 30 నాటికి ప్రభుత్వ బ్యాంకుల మొత్తం రుణాలు అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే.. 18.8శాతం వార్షిక వృద్ధితో రూ.127 లక్షల కోట్లకు చేరాయి. డిపాజిట్లు 12.9 శాతం పెరిగి రూ.165.2 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఈ కాలంలో పీఎస్‌బీల మొత్తం లాభాలు సైతం 16.9 శాతం వృద్ధితో రూ.1.09 లక్షల కోట్లకు దూసుకెళ్లాయి. నికర ఎన్‌పీఏలు సెప్టెంబర్‌ చివరి నాటికి మొత్తం రుణాల్లో 0.33 శాతానికి (రూ.44100 కోట్లు) తగ్గాయి.

ఇవి కూడా చదవండి...

కుటుంబంతో కలిసి ఓటు వేసిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

ఎన్టీఆర్ జిల్లాలో పంచాయతీ పోలింగ్.. ఉదయం 8 గంటలకు 8.32 శాతం నమోదు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 27 , 2026 | 03:24 AM