Share News

పీఎస్‌బీల విలీనాలకు శ్రీకారం?

ABN , Publish Date - Feb 01 , 2026 | 02:25 AM

వికసిత్‌ భారత్‌ లక్ష్యాల సాధనలో భాగంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎ్‌సబీ) సమగ్ర పరివర్తనం కోసం రోడ్‌మ్యా్‌పను బడ్జెట్లో ప్రకటించే అవకాశముంది. బ్యాంకింగ్‌ రంగంలో...

పీఎస్‌బీల విలీనాలకు శ్రీకారం?

వికసిత్‌ భారత్‌ లక్ష్యాల సాధనలో భాగంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎ్‌సబీ) సమగ్ర పరివర్తనం కోసం రోడ్‌మ్యా్‌పను బడ్జెట్లో ప్రకటించే అవకాశముంది. బ్యాంకింగ్‌ రంగంలో నిర్మాణాత్మక సంస్కరణలు, ఆధునిక సాంకేతికత వినియోగంతో పాటు పీఎ్‌సబీలను ప్రపంచ స్థాయి బ్యాంకులుగా తీర్చిదిద్దడంపై ఈ రోడ్‌మ్యాప్‌ దృష్టి సారించనుంది. 2047 నాటికి కనీసం రెండు పీఎ్‌సబీలు ప్రపంచ టాప్‌-20 బ్యాంకుల జాబితాలో ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం బడ్జెట్లో మలివిడత పీఎ్‌సబీల విలీనాలను ప్రకటించవచ్చు. చిన్న సైజు పీఎ్‌సబీలను ప్రస్తుత టాప్‌-5 బ్యాంకుల్లో కలిపే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ వ్యూహంలో భాగంగానే యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ)లో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (బీఓఐ)ను విలీనం చేసే దిశగా కసరత్తు జరుగుతోంది. ఈ మెర్జర్‌ ఏడాది చివరికల్లా పూర్తి కావచ్చని అంచనా.

ఈక్విటీ, బ్యాంక్‌ డిపాజిట్లపై ఏకరీతి పన్ను..

బ్యాంకు డిపాజిట్లు, ఈక్విటీ పెట్టుబడులపై లభిం చే రాబడులపై పన్ను విధానంలో సమానత్వం అవసరమని ఎస్‌బీఐ చైర్మన్‌ శ్రీనివాసులు శెట్టి అన్నారు. ప్రపంచంలో మరెక్కడా ఈ రెండు రకాల రాబడు లపై విధించే పన్నులో వ్యత్యాసం లేదని అన్నారు.

ఇవి కూడా చదవండి..

ఆర్థిక శాఖ మినహా సునేత్రకు మూడు శాఖలు..

మహారాష్ట్ర డీసీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సునేత్ర పవార్

For More National News And Telugu News

Updated Date - Feb 01 , 2026 | 02:25 AM