Share News

పిక్సెల్‌ రూ.950 కోట్ల సమీకరణ

ABN , Publish Date - Sep 08 , 2026 | 03:32 AM

అమెరికన్‌ టెక్‌ దిగ్గజం గూగుల్‌ పెట్టుబడులు కలిగిన భారత అంతరిక్ష సాంకేతిక (స్పేస్‌ టెక్నాలజీ) రంగ స్టార్టప్‌ పిక్సెల్‌ తాజాగా 10 కోట్ల డాలర్ల (సుమారు రూ.950 కోట్లు) నిధులు సమీకరించింది.

పిక్సెల్‌ రూ.950 కోట్ల సమీకరణ
space

  • దేశీయ స్పేస్‌టెక్‌ రంగంలో ఇదే అతిపెద్ద ఫండింగ్‌

న్యూఢిల్లీ: అమెరికన్‌ టెక్‌ దిగ్గజం గూగుల్‌ పెట్టుబడులు కలిగిన భారత అంతరిక్ష సాంకేతిక (స్పేస్‌ టెక్నాలజీ) రంగ స్టార్టప్‌ పిక్సెల్‌ తాజాగా 10 కోట్ల డాలర్ల (సుమారు రూ.950 కోట్లు) నిధులు సమీకరించింది. సిరీస్‌ సీ రౌండ్‌లో భాగంగా సింగపూర్‌ ప్రభుత్వ ఇన్వెస్టర్‌ టెమాసెక్‌, బ్రిటిష్‌ స్పేస్‌టెక్‌ వెంచర్‌ ‘సెరాఫిమ్‌’తో పాటు రాడికల్‌ వెంచర్స్‌, గ్రోఎక్స్‌ వెంచర్స్‌, 360వన్‌ అసెట్‌, ఐఎంఎం ఇన్వె్‌స్టమెంట్‌ నుంచి ఈ నిధులు సేకరించినట్లు పిక్సెల్‌ సోమవారం వెల్లడించింది. దేశీయ స్పేస్‌టెక్‌ రంగంలో ఇదే అతిపెద్ద ఏకకాల ఫండింగ్‌. దీంతో కలిపి పిక్సెల్‌ ఇప్పటివరకు సమీకరించిన మొత్తం నిధుల విలువ 19.5 కోట్ల డాలర్లకు చేరుకుంది.

పెప్టైడ్స్‌, ఏపీఐల కోసం రూ.150 కోట్ల పెట్టుబడి

న్యూఢిల్లీ: పెప్టైడ్స్‌, అధిక సామర్ధ్యం ఉండే యాక్టివ్‌ ఫార్మా ఇన్‌గ్రిడియెంట్స్‌ (ఏపీఐ) ఉత్పత్తిపై హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే హెచ్‌ఆర్‌వీ ఫార్మా దృష్టి పెడుతోంది. కీలకమైన ఈ రెండు ఉత్పత్తుల కోసం రూ.150 కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నట్టు తెలిపింది. ఇందులో రూ.40 నుంచి రూ.50 కోట్ల మొత్తాన్ని పెప్టైడ్స్‌ ఉత్పత్తి చేసే కంపెనీలో వ్యూహాత్మక పెట్టుబడిగా, మిగతా రూ.100 కోట్లు క్యాన్సర్‌ చికిత్సలో ఉపయోగించే తుది ఔషధాల తయారీకి ఉపయోగపడే అధిక సామర్ధ్యం ఉన్న ఏపీఐ ఉత్పత్తి కోసం ఒక జాయింట్‌ వెంచర్‌ కంపెనీలో పెట్టుబడిగా పెడతామని కంపెనీ వ్యవస్థాపకులు, ఎండీ, సీఈఓ చెరెడ్డి హరి కిరణ్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి

లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

ఉద్యోగాల పేరుతో మోసం.. పోలీసుల అదుపులో యూట్యూబర్ నందన

Updated Date - Sep 08 , 2026 | 03:32 AM