రూ.290 కోట్లతో పిట్టీ ఇంజనీరింగ్ కొత్త ప్లాంట్
ABN , Publish Date - May 15 , 2026 | 04:09 AM
పిట్టీ ఇంజనీరింగ్.. కాస్టింగ్, మెషిన్డ్ కాంపోనెంట్స్ కోసం కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. తెలంగాణలోని మాచారం ప్లాంట్ సమీపంలోనే ఈ కొత్త ప్లాంట్‌ను...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): పిట్టీ ఇంజనీరింగ్.. కాస్టింగ్, మెషిన్డ్ కాంపోనెంట్స్ కోసం కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. తెలంగాణలోని మాచారం ప్లాంట్ సమీపంలోనే ఈ కొత్త ప్లాంట్‌ను రూ.290 కోట్ల పెట్టుబడితో నెలకొల్పనున్నట్లు వెల్లడించింది. 2029-30 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం నాటికి ఈ ప్లాంట్‌ను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ప్లాంట్ అందుబాటులోకి వస్తే కాస్టింగ్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 36,000 మెట్రిక్ టన్నులకు చేరుకుంటుందని పేర్కొంది. కాగా కస్టమర్ల నుంచి డిమాండ్ పెరుగుతుండటంతో ప్రస్తుత ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 18,600 మెట్రిక్ టన్నుల నుంచి 24,600 మెట్రిక్ టన్నులకు పెంచుతున్నట్లు తెలిపింది. ఈ ఉత్పత్తి సామర్థ్యం పెంపు కోసం ఇప్పటికే రూ.100 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టినట్లు పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధం ముగిసే నాటికి ఈ విస్తరణ పనులు పూర్తవుతాయని అంచనా వేస్తున్నట్లు పిట్టీ ఇంజనీరింగ్ తెలిపింది.
తగ్గిన లాభం: కాగా 2025-26 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో రూ.506 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.29 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు పిట్టీ ఇంజనీరింగ్ వెల్లడించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే ఆదాయం 7 శాతం పెరగగా లాభం మాత్రం 21 శాతం క్షీణించింది.
ఈ వార్తలు కూడా చదవండి...
టూరిజం, టెంపుల్ కారిడార్లపై సీఎం ప్రత్యేక ప్రణాళిక
సోషల్ మీడియాలో నిబంధనలు మీరితే కఠిన చర్యలు.. డీజీపీ వార్నింగ్
పోలీసులకు బండి భగీరథ్ లేఖ.. మే 15న విచారణకు హాజరవుతా
Read Latest Telangana News And AP News And International News