Share News

మాటలతోనే చెల్లింపులు

ABN , Publish Date - Feb 22 , 2026 | 03:27 AM

ఫిన్‌టెక్‌ సంస్థ ఫోన్‌పే.. డిజిటల్‌ చెల్లింపుల్లో వినియోగదారుల అనుభవాన్ని మరింత స్మార్ట్‌గా మారుస్తూ ‘ఏఐ ఆధారిత నేచురల్‌ లాంగ్వేజ్‌ సెర్చ్‌’ ఫీచర్‌ను...

మాటలతోనే చెల్లింపులు

ఫోన్‌పేలో కొత్త ఫీచర్‌

న్యూఢిల్లీ: ఫిన్‌టెక్‌ సంస్థ ఫోన్‌పే.. డిజిటల్‌ చెల్లింపుల్లో వినియోగదారుల అనుభవాన్ని మరింత స్మార్ట్‌గా మారుస్తూ ‘ఏఐ ఆధారిత నేచురల్‌ లాంగ్వేజ్‌ సెర్చ్‌’ ఫీచర్‌ను ప్రారంభించింది. మైక్రోసాఫ్ట్‌ ఫౌండ్రీ భాగస్వామ్యంతో ఈ వినూత్న ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా వినియోగదారులు యాప్‌లో క్లిష్టమైన మెనూలను వెతకాల్సిన పని లేకుండా కేవలం సాధారణ వాయిస్‌, టెక్ట్స్‌ కమాండ్స్‌తో లావాదేవీలను పూర్తి చేయవచ్చని ఫోన్‌పే తెలిపింది. ఇది ఆన్‌-డివై్‌స, క్లౌడ్‌ ఆఽధారంగా పనిచేసే హైబ్రిడ్‌ మోడల్‌ అని, వినియోగదారుల డేటా భద్రతకు ఎటువంటి ముప్పు లేకుం డా సురక్షితంగా చెల్లింపులు చేపట్టవచ్చని ఫోన్‌పే వ్యవస్థాపకుడు, సీటీఓ రాహుల్‌ చారి తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..

క్వాంటం ఎకో సిస్టంతో.. ఏపీకి ప్రపంచ స్థాయిలో గుర్తింపు: సీఎం చంద్రబాబు

లోకేశ్ విందులో రాజకీయ ఏకత్వం.. కుటుంబ విలువల ప్రతిబింబం..

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 22 , 2026 | 03:27 AM