Share News

Parliament Budget Session: జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..

ABN , Publish Date - Jan 06 , 2026 | 01:45 PM

వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు పార్లమెంట్ సమావేశం కాబోతోంది. జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. తొలి రోజున పార్లమెంట్ ఉభయ సభల సమావేశం జరగనుంది.

Parliament Budget Session: జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..
Parliament Budget Session

వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు పార్లమెంట్ సమావేశం కాబోతోంది. జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. తొలి రోజున పార్లమెంట్ ఉభయ సభల సమావేశం జరగనుంది. ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలి రోజు ప్రసంగించనున్నారు (Parliament Budget Session January 31).


ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది (India Budget Session 2026). ఆ రోజు ఆదివారం అయినప్పటికీ ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఆదివారం రోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం చరిత్రలో ఇదే తొలిసారి కాబోతోంది. బడ్జెట్ సమావేశాల్లో వన్ నేషన్- వన్ ఎలక్షన్ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. అలాగే 30 రోజులకు పైగా జైలు జీవితం గడిపే సీఎంలు, మంత్రులను పదవి నుంచి తొలగించే బిల్లును కూడా ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్టు సమాచారం.


ఇవి కూడా చదవండి..

యమధర్మరాజు లీవ్‌లో ఉన్నాడేమో.. ఈ మందు బాబు వీడియో చూడండి..


వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా సత్యసాయి బాబా భక్తురాలు..

Updated Date - Jan 06 , 2026 | 03:04 PM