ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్.. రూ.10 లక్షలు దాటితే పాన్ తప్పనిసరి..
ABN , Publish Date - Mar 22 , 2026 | 06:00 PM
పాన్ కార్డుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరికొన్ని మార్పులు చేపట్టింది. ఆర్థిక లావాదేవీల్లో నిత్యం ఉపయోగించే పాన్ కార్డుకు సంబంధించి కీలక మార్పులను ప్రకటించింది. లావాదేవీల పరిమితులను గణనీయంగా పెంచింది.
పాన్ కార్డుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరికొన్ని మార్పులు చేపట్టింది. ఆర్థిక లావాదేవీల్లో నిత్యం ఉపయోగించే పాన్ కార్డుకు సంబంధించి కీలక మార్పులను ప్రకటించింది. లావాదేవీల పరిమితులను గణనీయంగా పెంచింది. తాజాగా ఆదాయపు పన్ను నిబంధనలు-2026ను కేంద్రం నోటిఫై చేసింది. ఇందులో భాగంగా పాన్ కార్డుకు సంబంధించిన లావాదేవీ పరిమితులను సవరించింది. ఈ కొత్త రూల్స్ ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయి (PAN rules 2026).
ఒక ఆర్థిక సంవత్సరంలో మీ బ్యాంకు ఖాతాలో రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదును ఒకేసారి లేదా విడతల వారీగా జమ చేసినా, విత్ డ్రా చేసినా పాన్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకటే బ్యాంకులో అయినా లేదా వేర్వేరు బ్యాంకుల్లో అయినా ఈ నిబంధన వర్తిస్తుంది. ప్రస్తుతం ఒక రోజులో రూ.50 వేలు దాటితేనే పాన్ కార్డు అడుగుతున్నారు (PAN rules changes April 1).
ఇళ్లు, స్థలాల కొనుగోళ్లు, అమ్మకాలు, బహుమతి లేదా డెవలప్మెంట్ ఒప్పందాల విషయంలో లావాదేవీ విలువ రూ.20 లక్షలు దాటితే పాన్ వివరాలు ఇవ్వాలి. ప్రస్తుతం ఈ పరిమితి రూ.10 లక్షలుగా ఉంది. స్థిరాస్థి ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలోనే ఈ పరిమితిని రెట్టింపు చేశారు (Taxpayer updates).
హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలకు చేసే చెల్లింపులు రూ.లక్ష దాటితే ఇకపై పాన్ సమర్పించాలి. ప్రస్తుతం హోటళ్లు, రెస్టారెంట్ల బిల్లు రూ.50 వేలు దాటితేనే పాన్ అడుగుతున్నారు. ఈ పరిమితిని కూడా రెట్టింపు చేశారు.
ఏప్రిల్ 1 తర్వాత, బైక్‌లతో పాటు ఏ మోటారు వాహనం కోనుగోలు చేసినా, దాని విలువ రూ.5 లక్షలు దాటితే పాన్ సమర్పించాలి. ప్రస్తుతం బైక్‌ల కొనుగోలు సమయంలో పాన్ సమర్పించాల్సిన అవసరం లేదు. కొత్త చట్టం ప్రకారం బైక్‌ల కొనుగోళ్ల సమయంలో కూడా పాన్ సమర్పించాలి. ప్రస్తుతం ధరతో సంబంధం లేకుండా కార్లు, ఇతర మోటార్ వాహనాలు కొంటే పాన్ తప్పనిసరి. కొత్త చట్టంలో రూ.5 లక్షల పరిమితిని తీసుకొచ్చారు (Tax rules 2026).
కొత్త చట్టం ప్రకారం ప్రతీ బీమా పాలసీకి పాన్ తప్పనిసరి. ప్రస్తుతం వార్షిక ప్రీమియం రూ.50 వేలు దాటితేనే పాన్ ఇవ్వాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి..
ప్రధాని మోదీ అరుదైన రికార్డు.. సుదీర్ఘకాలం ప్రభుత్వాధిపతిగా..
ట్రంప్ ఆరోగ్యంగానే ఉన్నారా.. విమానం దిగుతూ తడబడిన నేపథ్యంలో చర్చ..