Share News

ఎన్‌ఎస్‌ఈ @ నం.7

ABN , Publish Date - Sep 25 , 2026 | 06:12 AM

నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) షేర్ల లిస్టింగ్‌ రోజునే రికార్డుల మోత మోగించింది. సోమవారం ఐపీఓ ముగించుకున్న ఎన్‌ఎస్‌ఈ.. సెబీ నిబంధనల ప్రకారం తన షేర్లను ప్రత్యర్థి ఎక్ఛేంజ్‌ బీఎస్‌ఈలో గురువారం...

ఎన్‌ఎస్‌ఈ @ నం.7

స్టాక్‌ మార్కెట్లో షేర్ల లిస్టింగ్‌తో ప్రపంచంలో ఏడో అత్యంత విలువైన ఎక్స్ఛేంజీగా అవతరణ

  • ఆసియాలో రెండో అత్యంత విలువైన ఎక్స్ఛేంజీ కూడా..

  • తొలి రోజు ట్రేడింగ్‌లో 5.21ు వరకు పెరిగిన షేరు ధర

  • చివరికి 1.85 ు లాభంతో రూ.1,818 వద్ద ముగింపు

  • రూ.4.50 లక్షల కోట్లుగా నమోదైన ఎక్స్ఛేంజీ మార్కెట్‌ విలువ

  • బీఎస్‌ఈ మార్కెట్‌ క్యాప్‌తో పోలిస్తే దాదాపు మూడింతలు

  • దేశంలో 11వ అత్యంత విలువైన లిస్టెడ్‌ కంపెనీ ఇదే..

ముంబై: నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) షేర్ల లిస్టింగ్‌ రోజునే రికార్డుల మోత మోగించింది. సోమవారం ఐపీఓ ముగించుకున్న ఎన్‌ఎస్‌ఈ.. సెబీ నిబంధనల ప్రకారం తన షేర్లను ప్రత్యర్థి ఎక్ఛేంజ్‌ బీఎస్‌ఈలో గురువారం నమోదు చేసింది. ఐపీఓ ధర రూ.1,785తో పోలిస్తే, ఎన్‌ఎస్‌ఈ షేరు 0.84 శాతం ప్రీమియంతో రూ.1,800 వద్ద ట్రేడింగ్‌ ఆరంభించింది. తొలి గంటలోనే 5.21 శాతం వరకు ఎగబాకి రూ.1,878 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. మళ్లీ క్రమంగా తగ్గుతూ వచ్చి, తొలిరోజు ట్రేడింగ్‌ ముగిసేసరికి షేరు ధర 1.85 శాతం లాభంతో రూ.1,818 వద్ద స్థిరపడింది. దాంతో ఎన్‌ఎస్‌ఈ మార్కెట్‌ విలువ రూ.4,49,955 కోట్లుగా నమోదైంది. మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ పరంగా ఎన్‌ఎ్‌సఈ.. ప్రపంచంలో ఏడో అత్యంత విలువైన స్టాక్‌ ఎక్స్ఛేంజీగా అవతరించింది. ఆసియాలో రెండో అత్యంత విలువైన ఎక్స్ఛేంజీ కూడా. అలాగే, దేశంలోని అత్యంత విలువైన లిస్టెడ్‌ కంపెనీల్లో 11వ స్థానంలో నిలిచింది. ఇంట్రాడే ట్రేడింగ్‌ లో టాప్‌-10లోకి దూసుకెళ్లినప్పటికీ, చివరివరకు కొనసాగలేకపోయింది. అంతేకాదు, బీఎ్‌సఈ మార్కెట్‌ విలువ రూ.1.29 లక్షల కోట్లతో పోలిస్తే ఎన్‌ఎ్‌సఈ విలువ మూడింతలు ఎక్కువ.


మార్కెట్‌ క్యాప్‌ పరంగా ప్రపంచంలోని 10 అత్యంత విలువైన స్టాక్‌ ఎక్స్ఛేంజీలు

ఎక్స్ఛేంజీ కోట్ల డాలర్లు

సీఎంఈ గ్రూప్‌ 9,737

ఇంటర్‌కాంటినెంటల్‌ ఎక్స్ఛేంజీ 8,777

హాంకాంగ్‌ ఎక్స్ఛేంజెస్‌ 6,340

డాయిష్‌ బ్రోస్‌ 5,809

నాస్‌డాక్‌ 5,334

లండన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ 5,289

ఎన్‌ఎ్‌సఈ 4,687

సీబీఓఈ గ్లోబల్‌ మార్కెట్స్‌ 2,807

సింగపూర్‌ ఎక్స్ఛేంజీ 1,875

నెదర్లాండ్స్‌ యూరోనెక్ట్స్‌ 1,812

ఎన్‌ఎస్‌ఈ బాధ్యతల్లో మార్పుండదు..

మార్కెట్లో షేర్ల నమోదు అనంతరమూ ఎన్‌ఎస్‌ఈ బాధ్యతల్లో మార్పుండదు. ఎక్స్ఛేంజీపై రెండు బాధ్యతలున్నాయి. మొదటిది స్టాక్‌ ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్‌గా మార్కెట్లో నైతికంగా సేవలందించడంతో పాటు మదుపరుల ప్రయోజనాలను పరిరక్షించడం. రెండోది వాణిజ్య సంస్థగా ఆర్థిక పనితీరుపై దృష్టిసారించడంతో పాటు వాటాదారులకు మెరుగైన ప్రతిఫలాలు పంచడం. కానీ, ఈ రెండూ ఒకదానికొకటి అడ్డుపడే పరిస్థితే వస్తే స్వప్రయోనాలను పక్కకు పెట్టి మార్కెట్‌ సేవలు, ఇన్వెస్టర్ల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. మార్కెట్‌కు మంచి కానిదేదీ ఎక్స్ఛేంజీకి మంచిది కాదు.

ఇంజేటి శ్రీనివాస్‌, చైర్మన్‌,ఎన్‌ఎస్‌ఈ

ఈ వార్తలనూ చదవండి

వృద్ధురాలి పాలిట మృత్యువులా వచ్చిన కోతి.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..

అహ్మదాబాద్ విషాదం.. విద్యార్థినిపైకి దూసుకెళ్లిన క్రేన్.. వీడియో వైరల్

Updated Date - Sep 25 , 2026 | 06:12 AM