బడ్జెట్ 2026: నిర్మలమ్మ చేతిలో రెడ్ బ్యాగ్.. ప్రత్యేకతలివే..
ABN , Publish Date - Feb 01 , 2026 | 11:35 AM
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె చేతిలోని చిన్నపాటి ఎరుపు రంగు సంచి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమర్పణ కోసం తనతో పాటు పార్లమెంటుకు తీసుకువెళ్లే బడ్జెట్ బ్యాగ్ ప్రత్యేకంగా నిలిచింది. గతంలో బడ్జెట్ సమర్పణ కోసం ఆర్థిక మంత్రులు బ్రీఫ్‌కేస్‌ను ఉపయోగించేవారు. అయితే ప్రస్తుత విత్త మంత్రి నిర్మలమ్మ ఆ సంప్రదాయాన్ని మారుస్తూ.. 2019లో తొలిసారి ఎరుపు రంగు బహీ ఖాతాను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం కూడా అదే తరహాలో రెడ్ కలర్ బ్యాగ్‌తో ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు పార్లమెంట్‌కు వెళ్లారు.
ఉదయం 11:00 గంటలకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో ఆమె ధరించిన చీర, ఆమె చేతిలోని రెడ్ కలర్ బ్యాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను ఆమె ఈ ఎర్రటి సంచిలో కొత్త ట్యాబ్‌తో బడ్జెట్‌ను సమర్పించారు. ఈ ఎరుపు రంగు సంచిపై జాతీయ చిహ్నమైన నాలుగు సింహాల ఎంబ్లెమ్ ఉంటుంది. వలసరాజ్యాల కాలం నాటి బ్రీఫ్‌కేస్ స్థానంలో ఒక సాంప్రదాయ భారతీయ అకౌంటింగ్ లెడ్జర్ అయిన ఈ 'బహీ ఖాతా'ను 2019లో ఆమె తీసుకొచ్చారు. అలానే 2021లో పేపర్‌లెస్ ఫార్మాట్‌లో మేడ్-ఇన్-ఇండియా టాబ్ ద్వారా బడ్జెట్‌ను సమర్పించడం ప్రారంభించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఈ చిన్న రెడ్ బ్యాగ్‌లో లక్షల కోట్ల బడ్జెట్.. దీని చరిత్ర తెలుసా..