Share News

2027 చివరినాటికి నిఫ్టీ @: 29,000

ABN , Publish Date - Nov 27 , 2026 | 05:07 AM

వచ్చే ఏడాది చివరి నాటికి నిఫ్టీ-50 సూచీ మరో 12 శాతం పెరిగి 29,000 స్థాయికి చేరుకోవచ్చని అమెరికన్‌ బ్రోకరేజీ సేవల దిగ్గజం జేపీ మోర్గాన్‌ అంచనా వేసింది....

2027 చివరినాటికి నిఫ్టీ @: 29,000

జేపీ మోర్గాన్‌ అంచనా

ముంబై: వచ్చే ఏడాది చివరి నాటికి నిఫ్టీ-50 సూచీ మరో 12 శాతం పెరిగి 29,000 స్థాయికి చేరుకోవచ్చని అమెరికన్‌ బ్రోకరేజీ సేవల దిగ్గజం జేపీ మోర్గాన్‌ అంచనా వేసింది. ఎంఎస్‌సీఐ(మోర్గాన్‌ స్టాన్లీ క్యాపిటల్‌ ఇంటర్నేషనల్‌) ఇండియా ఇండెక్స్‌లోని కంపెనీల రాబడి ఈ ఏడాదిలో 12 శాతం, 2027లో 14 శాతం మేర వృద్ధి చెందవచ్చని గురువారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.

మార్కెట్లకు కలిసిరానున్న అంశాలు..

చమురు ధరల తగ్గుదల, మళ్లీ పుంజుకుంటున్న రూపాయి, పెరుగుతున్న లిస్టెడ్‌ కంపెనీల లాభాదాయకత, ప్రైవేట్‌ రంగ మూలధన పెట్టుబడులు, రుణాల వృద్ధి, ప్రైవేట్‌ వినియోగం జోరు, డిజిటల్‌ ఎకానమీ.

ప్రతికూల అంశాలు

కంపెనీల షేర్లు అధిక ధరల స్థాయిలో ట్రేడవడం, దేశీయంగా విధానపరమైన అవరోధాలు, అంతర్జాతీయ అనిశ్చితులు మార్కెట్‌ భవిష్యత్‌ వృద్ధిని పరిమితం చేసే ప్రమాదం ఉంది.

మరో రూ.9.25 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు!

కృత్రిమ మేధ(ఏఐ) కంపెనీలు అధికంగా ఉన్న అమెరికా తదితర మార్కెట్లతో భారత్‌ పోటీపడటం లేదని, ఏఐ బుడగ ఆందోళనల నేపథ్యంలో ఇతర మార్కెట్లకు పెట్టుబడులను మళ్లించుకోవాలనుకుంటున్న విదేశీ ఇన్వెస్టర్లకు భారత్‌ ఆకర్షణీయంగా కన్పిస్తోందని జేపీ మోర్గాన్‌ అంటోంది. అమెరికా సహా ఇతర మార్కెట్లలో ఏఐ స్టాక్స్‌లో అమ్మకాలు పోటెత్తిన నేపథ్యంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐ) ఈ నవంబరులో 140 కోట్ల డాలర్ల పెట్టుబడులను భారత మార్కెట్‌కు మళ్లించారు. వారు తమ పెట్టుబడుల జోరును కొనసాగిస్తే, మరో 10,000 కోట్ల డాలర్ల (రూ.9.25 లక్షల కోట్లు) నిధులు భారత ఈక్విటీల్లోకి వచ్చే అవకాశం ఉందని జేపీ మోర్గాన్‌ అంటోంది.

ఇవి కూడా చదవండి...

కుటుంబంతో కలిసి ఓటు వేసిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

ఎన్టీఆర్ జిల్లాలో పంచాయతీ పోలింగ్.. ఉదయం 8 గంటలకు 8.32 శాతం నమోదు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 27 , 2026 | 05:07 AM