Upcoming IPOs and Listings: వచ్చే వారం స్టాక్ మార్కెట్లో ఫుల్ జోష్.. కొత్తగా ఆరు IPO లు, ఐదు లిస్టింగులు..
ABN , Publish Date - Jan 10 , 2026 | 05:46 PM
ప్రైమరీ మార్కెట్లో వచ్చే వారం హడావుడి కనిపించనుంది. జనవరి 12-16 మధ్య ఏకంగా 6 కొత్త ఐపీఓలు సబ్‌స్క్రిప్షన్ కోసం అందుబాటులోకి రాబోతున్నాయి. దీంతోపాటు 5 ఐపీఓలు వచ్చే వారమే స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్టింగ్ కానున్నాయి.
ఆంధ్రజ్యోతి, జనవరి 10: వచ్చే వారం ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఫుల్ జోష్ కనిపించబోతోంది. ప్రైమరీ మార్కెట్ ఫుల్ బిజీగా ఉండబోతోంది. కొత్తగా 6 IPOలు (ఒకటి మెయిన్‌బోర్డ్ + 5 SME) సబ్‌స్క్రిప్షన్ కోసం ఓపెన్ అవుతున్నాయి. అలాగే 5 లిస్టింగ్‌లు (ఇటీవలి IPOల నుంచి) జరగనున్నాయి. దీంతో ఇది ఇన్వెస్టర్లను బాగా ఆకర్షించే అవకాశం ఉంది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ సెంటిమెంట్ మెరుగుపడుతున్న సమయంలో.. కొత్తగా ఓపెన్ అవుతున్న IPOలు మార్కెట్ కు మరింత బూస్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది.
కొత్త ఐపీవోలు, లిస్టింగ్స్ వివరాలు..
Amagi Media Labs Ltd IPO (మెయిన్‌బోర్డ్)
ఓపెన్: జనవరి 13, 2026
క్లోజ్: జనవరి 16, 2026
ఇష్యూ సైజ్: రూ. 1,788 కోట్లు
ప్రైస్ బ్యాండ్: రూ. 343–రూ.361
ఇది బెంగళూరు బేస్డ్ SaaS కంపెనీ. మీడియా టెక్ సెక్టార్‌లో బలమైనది. ఇది పెద్ద ఇష్యూ కావడంతో హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి.
ఇతర SME IPOలు జనవరి 12–14 మధ్య ఓపెన్ కానున్నాయి.. వాటి వివరాలిలా:
1. Avana Electrosystems Ltd
2. INDO SMC Ltd
3. Narmadesh Brass Industries Ltd
4. GRE Renew Enertech Ltd
5. Armour Security India Ltd
ఈ SMEలు చిన్న సైజ్ (రూ. 25–రూ. 90 కోట్ల మధ్య) కానీ.. హై గ్రోత్ పొటెన్షియల్ ఉన్న సెక్టార్లు (ఎలక్ట్రికల్, రిన్యూవబుల్ ఎనర్జీ, సెక్యూరిటీ మొదలైనవి). రిస్క్-రివార్డ్ బ్యాలెన్స్ చూసి బిడ్ చేయవచ్చు.
ఈ వారం స్టాక్ ఎక్సేంజ్ లలో లిస్టింగ్‌లు కానున్న కంపెనీలు:
Bharat Coking Coal Ltd (Coal India సబ్సిడియరీ) – జనవరి 16, 2026 (BSE/NSE)
Defrail Technologies Ltd – జనవరి 15 లేదా 16
ఇతర SMEల నుంచి Avana, GRE Renew వంటివి ఈ వారం చివర్లో లేదా నెక్స్ట్ వీక్ బిగినింగ్‌లో లిస్ట్ అవుతాయి.
ఈ బిజీ వీక్‌లో మెయిన్‌బోర్డులో Amagi మీద ఫోకస్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇది టెక్ సెక్టార్‌కు బూస్టింగ్ ఇవ్వవచ్చు. SMEలు మాత్రం హై వాలటిలిటీతో బిగ్ గెయిన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది (లేదా లాస్ కూడా!).
గమనిక: రీసెర్చ్ చేసి, GMP (గ్రే మార్కెట్ ప్రీమియం) చెక్ చేయండి. రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే మాత్రమే బిడ్ చేయండి. IPOలు అనేవి షార్ట్-టర్మ్ గెయిన్స్ కోసం మంచివి కానీ లాంగ్-టర్మ్ కోసం కంపెనీ ఫండమెంటల్స్ చూడాలి.
ఇవి కూడా చదవండి..
ఐఏఎస్ అధికారిపై తప్పుడు కథనం.. ఐఏఎస్ సంఘం రియాక్షన్ ఇదే..
ప్రజలకు తెలంగాణ డ్రగ్ కంట్రోల్ కీలక హెచ్చరికలు..
Read Latest Telangana News And Telugu News