సొరంగాల నిర్మాణంలో నవయుగ సత్తా
ABN , Publish Date - May 02 , 2026 | 02:39 AM
రహదారి ప్రాజెక్టులకు సంబంధించిన సొరంగాల నిర్మాణంలో హైదరాబాద్ కేంద్రంగా ఉన్న నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ (ఎన్‌ఈసీఎల్) మరోసారి తన సత్తా...
గిన్నిస్ రికార్డుల్లోకి ముంబై-పుణె మిస్సింగ్ లింక్ ప్రాజెక్ట్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): రహదారి ప్రాజెక్టులకు సంబంధించిన సొరంగాల నిర్మాణంలో హైదరాబాద్ కేంద్రంగా ఉన్న నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ (ఎన్‌ఈసీఎల్) మరోసారి తన సత్తా చాటింది. శుక్రవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చేతుల మీదుగా ప్రారంభమైన ముంబై-పుణె ఎక్స్‌ప్రె్‌సవే మిస్సింగ్ లింక్ ప్రాజెక్టులో భాగంగా కంపెనీ నిర్మించిన రెండు సొరంగాలు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్‌లో నమోదయ్యాయి. రద్దీగా ఉండే ఖండాలా ఘాట్ రహదారిని బైపాస్ చేస్తూ ముంబై-పుణెల మధ్య దూరాన్ని, ప్రయాణ సమయాన్ని తగ్గించే 13.3 కిలోమీటర్ల ఈ ప్రాజెక్టులో భాగంగా 10.67 కిలోమీటర్ల పొడవైన రెండు సొరంగ మార్గాలను (టన్నెల్స్) ఎన్‌ఈసీఎల్ నిర్మించింది. ఐదు వరుసలతో ఒక్కోటి 22.33 మీటర్ల వెడల్పుతో ఈ సొరంగ మార్గాలు ఏర్పాటు చేశారు. ప్రపంచంలో ఇప్పటి వరకు మరే కంపెనీ ఇంత వెడల్పుతో సొరంగ రహదారి మార్గాలు నిర్మించలేదని ఎన్‌ఈసీఎల్ ఎండీ చింతా శ్రీధర్ తెలిపారు. అత్యంత కఠినమైన అగ్ని శిలలతో కూడిన సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో నిర్మించిన ఈ సొరంగ మార్గాల నిర్మాణంలో కంపెనీ అనేక సవాళ్లు ఎదుర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి:
నేను సీఎం కావాలన్నా.. కుర్చీ ఖాళీగా లేదు
జీవితంలో ఓడి... పదిలో గెలిచిన వర్షిత..
Read Latest Telangana News and National News