ముంబై, బెంగళూరు, చెన్నైకి మై హోమ్ గ్రూప్ విస్తరణ
ABN , Publish Date - Jan 22 , 2026 | 05:40 AM
మైహోమ్ గ్రూప్ తన రియల్ ఎస్ట్టేట్ వ్యాపారాన్ని ముంబై, బెంగళూరు, చెన్నై నగరాలకూ విస్తరించింది. ఈ నగరాల్లో 4.66 కోట్ల చదరపు అడుగుల (ఎస్‌ఎ్‌ఫటీ) విస్తీర్ణం ఉన్న ప్రాజెక్టుల అభివృద్ధి కోసం...
హైదరాబాద్: మైహోమ్ గ్రూప్ తన రియల్ ఎస్ట్టేట్ వ్యాపారాన్ని ముంబై, బెంగళూరు, చెన్నై నగరాలకూ విస్తరించింది. ఈ నగరాల్లో 4.66 కోట్ల చదరపు అడుగుల (ఎస్‌ఎ్‌ఫటీ) విస్తీర్ణం ఉన్న ప్రాజెక్టుల అభివృద్ధి కోసం రూ.4,100 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ ప్రాజెక్టుల అభివృద్ధి ద్వారా రూ.37,500 కోట్ల ఆదాయం లభిస్తుందని కంపెనీ భావిస్తోంది. జాతీయ స్థాయిలో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థగా ఎదగాలనే లక్ష్యంతో కొత్తగా ఈ నగరాలకు విస్తరిస్తోంది. మైహోమ్ గ్రూప్ ఇప్పటికే హైదరాబాద్ రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం, విద్యుత్, విద్య, సిమెంట్ రంగా ల్లో తన సత్తా చాటింది. గత నాలుగు దశాబ్ధాల్లో హైదరాబాద్, దాని చుట్టుపక్కల 8 కోట్ల ఎస్‌ఎ్‌ఫటీకి సమానమైన నిర్మాణాలు పూర్తి చేసింది. మరో 4 కోట్ల ఎస్‌ఎ్‌ఫటీకి సమానమైన భవనా లు నిర్మాణంలో ఉన్నాయి.
ఇవి కూడా చదవండి..
కాకినాడ పీబీసీ కాల్వలో స్పిరిట్ లారీ బోల్తా.. ప్రజలకు అధికారుల హెచ్చరికలు
భారత్, ఇజ్రాయెల్ ఆర్థిక సహకారానికి దావోస్ వేదిక: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News