నేడు స్టాక్ మార్కెట్లు ఓపెన్.. ఈ రోజు ట్రేడింగ్ వేళలు ఇవే..
ABN , Publish Date - Nov 08 , 2026 | 09:55 AM
పావళి పండుగ సందర్భంగా దేశీయ స్టాక్ మార్కెట్లలో ప్రత్యేక ముహూరత్ ట్రేడింగ్‌కు రంగం సిద్ధమైంది. సాధారణంగా ఆదివారాల్లో స్టాక్ మార్కెట్లు పనిచేయవు.
ఇంటర్నెట్ డెస్క్: దీపావళి పండుగ సందర్భంగా దేశీయ స్టాక్ మార్కెట్లలో ప్రత్యేక ముహూరత్ ట్రేడింగ్‌కు రంగం సిద్ధమైంది. సాధారణంగా ఆదివారాల్లో స్టాక్ మార్కెట్లు పనిచేయవు. అయితే దీపావళి లక్ష్మీ పూజను పురస్కరించుకుని నేడు ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ నిర్వహించనున్నారు. కొత్త హిందూ ఆర్థిక సంవత్సరం సంవత్ 2083 ప్రారంభాన్ని సూచించే ఈ ట్రేడింగ్‌పై మదుపరుల్లో ఆసక్తి నెలకొంది (Muhurat Trading 2026).
ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈల్లో ప్రధాన ఈక్విటీ ట్రేడింగ్ మధ్యాహ్నం 2:20 గంటలకు ప్రారంభమై 3:30 గంటలకు ముగుస్తుంది. మొత్తం 70 నిమిషాల పాటు సాధారణ ట్రేడింగ్ కొనసాగుతుంది. అంతకుముందు మధ్యాహ్నం 2:05 గంటలకు ప్రీ-ఓపెన్ సెషన్ ప్రారంభమవుతుంది. బ్లాక్ డీల్ సెషన్ 1:50-2:05 మధ్య, ప్రీ-ఓపెన్ సెషన్ మధ్యాహ్నం 2:05 నుంచి 2:10 గంటల వరకు జరుగుతాయి. ఆ తర్వాత 2:20 గంటలకు ప్రధాన ట్రేడింగ్ ప్రారంభమై 3.30కు ముగుస్తుంది. కమోడిటీ మార్కెట్‌లో ట్రేడింగ్ చేసే వారికి కూడా ప్రత్యేక సెషన్ అందుబాటులో ఉంటుంది (Diwali Muhurat Trading).
ఎంసీఎక్స్‌లో మధ్యాహ్నం 2:05 నుంచి 2:19 గంటల వరకు ప్రత్యేక ప్రారంభ సెషన్ నిర్వహిస్తారు (NSE Muhurat Trading Timings). అనంతరం ప్రధాన ట్రేడింగ్ సెషన్ 2:20 గంటలకు ప్రారంభమై 3:30 గంటలకు ముగుస్తుంది. ఈ సెషన్‌లో వివిధ కమోడిటీలు, సూచీలకు సంబంధించిన కాంట్రాక్టుల్లో ట్రేడింగ్ చేసుకోవచ్చు. క్లయింట్ కోడ్ మార్పులకు మధ్యాహ్నం 3:45 గంటల వరకు అవకాశం ఉంటుంది. ముహూరత్ ట్రేడింగ్‌లో షేర్లు కొనుగోలు చేసినా, విక్రయించినా సాధారణ సెటిల్‌మెంట్ నిబంధనలే వర్తిస్తాయి. ఈ సెషన్‌లో జరిగిన ఈక్విటీ లావాదేవీలకు టీ ప్లస్ వన్ (T+1) సెటిల్‌మెంట్ విధానం అమల్లో ఉంటుంది.
ఇవి కూడా చదవండి..
మైదానంలోకి ప్లాస్టిక్ బ్యాట్ విసిరిన అభిమాని.. విరాట్ కోహ్లీ ఏం చేశాడో చూడండి..
స్థిరంగా పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..