మెటాలో భారీ లేఆఫ్‌లు.. 10 శాతం ఉద్యోగులపై వేటు వేసేందుకు రంగం సిద్ధం..
ABN , Publish Date - May 19 , 2026 | 05:48 PM
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ మాతృసంస్థ అయిన మెటా మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగాల కోతకు సిద్ధమవుతోంది. కంపెనీ నిర్మాణాన్ని పూర్తిగా ఏఐ-కేంద్రితంగా మార్చే ప్రయత్నాల్లో భాగంగా వేలాది మంది ఉద్యోగులను తొలగించనుంది.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ మాతృసంస్థ అయిన మెటా మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగాల కోతకు సిద్ధమవుతోంది. కంపెనీ నిర్మాణాన్ని పూర్తిగా ఏఐ-కేంద్రితంగా మార్చే ప్రయత్నాల్లో భాగంగా వేలాది మంది ఉద్యోగులను తొలగించనుంది. అలాగే సుమారు 7,000 మంది ఉద్యోగులను ఏఐ ప్రాజెక్ట్‌లకు బదిలీ చేయనున్నట్టు వార్తలు వచ్చాయి (Meta layoffs 2026).
మెటా తన సంస్థ ఉద్యోగుల్లో దాదాపు పది శాతం మందిపై మే 20వ తేదీన వేటు వేయనుంది. ప్రస్తుతం కంపెనీలో సుమారు 78,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ కోతలతో సుమారు 8,000 మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. అలాగే 7 వేల మందిని కొత్త ఏఐ ఆధారిత ప్రాజెక్ట్‌ల్లోకి బదిలీ చేయనున్నారు. అంటే దాదాపు 15 వేల మంది ఉద్యోగులు మెటా నిర్ణయంతో ప్రభావితం కాబోతున్నారన్నమాట. అలాగే ఈ ఏడాది చివర్లో మరికొంత మందిని తొలగించేందుకు మెటా యాజమాన్యం సిద్ధమవుతున్నట్టు సమాచారం (Meta AI jobs).
మెటా ప్రస్తుతం ఏఐలో విస్తృతంగా పెట్టుబడులు పెడుతోంది (Meta restructuring). 2028 నాటికి ఏఐ రంగంలో డేటా సెంటర్ల ఏర్పాటు కోసం 600 బిలియన్ డాలర్లు వెచ్చించాలని మెటా ప్రణాళిక రూపొందించింది. ఈ క్రమంలోనే ఉద్యోగుల సంఖ్యను బాగా తగ్గించుకుని వ్యయ నియంత్రణల చర్యలు చేపడుతోంది. 2022లో 11 వేల మంది ఉద్యోగులను తొలగించిన మెటా, 2023లో 10 వేల మందిని విధుల్లో నుంచి తీసేసింది.
ఇవి కూడా చదవండి..
గల్ఫ్ దేశాల విజ్ఞప్తితో ఇరాన్‌పై దాడి వాయిదా.. ట్రంప్ కీలక ప్రకటన
పాపం పాకిస్థాన్.. భారత్‌లో లేని ఎయిర్‌బేస్‌లపై దాడులు చేసిందట..