మెటాలో 16 వేల మంది ఉద్యోగులు ఇంటికి.. ఏఐలో పెట్టుబడులే కారణమా..
ABN , Publish Date - Mar 14 , 2026 | 09:19 AM
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్‌వేర్ రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఆంథ్రోపిక్ వంటి స్టార్టప్‌ల దెబ్బకు పేరు మోసిన టెక్ కంపెనీలు కూడా వెనకడుగు వేస్తున్నాయి. ఏఐను అందిపుచ్చుకునే క్రమంలో ప్రముఖ కంపెనీలన్నీ అటు వైపు భారీగా పెట్టుబడలను పెడుతున్నాయి.
సాఫ్ట్‌వేర్ రంగంపై ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఆంథ్రోపిక్ వంటి స్టార్టప్‌ల దెబ్బకు పేరు మోసిన టెక్ కంపెనీలు కూడా వెనకడుగు వేస్తున్నాయి. ఏఐను అందిపుచ్చుకునే క్రమంలో ప్రముఖ కంపెనీలన్నీ అటు వైపు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఆ ప్రభావం ఉద్యోగులపై తీవ్రంగా పడుతోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకునే పని మొదలుపెట్టాయి. త్వరలో మెటా కూడా అదే బాటలో నడవబోతోందట (Meta layoffs).
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ అయిన మెటా త్వరలో 16 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోందట. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆర్టిషీయల్ ఇంటెలిజెన్స్‌లో మెటా భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాలని మెటా భావిస్తోందట. ఈ మేరకు సీనియర్ లీడర్స్‌కు టాప్ అఫీషియల్స్ సమాచారం అందించినట్టు తెలుస్తోంది (Meta job cuts 2026).
మెటాలో ప్రస్తుతం 79 వేల మంది పని చేస్తున్నారు (Big tech layoffs). వారిలో 20 శాతం మందిని మెటా తొలగించనుందట. అంటే దాదాపు 16 వేల మంది లేఆఫ్ ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నారన్నమాట. అయితే ఈ కథనాలపై మెటా నుంచి అధికారిక ప్రకటన ఇప్పటివరకు రాలేదు. కాగా, 2028 నాటికి ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్ల ఏర్పాటు కోసం 600 బిలియన్ డాలర్లను వెచ్చించాలని మెటా ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
దుబాయ్ ఖాళీ.. ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉందంటే..