Share News

మారుతి సుజుకీ ప్రైస్‌ ప్రొటెక్షన్‌ స్కీమ్‌

ABN , Publish Date - Jun 10 , 2026 | 03:09 AM

మారుతి సుజుకీ చిన్న కార్లను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్ల కోసం ప్రైస్‌ ప్రొటెక్షన్‌ స్కీమ్‌ను మంగళవారం ప్రకటించింది. ఈ నెల 14 వరకు...

మారుతి సుజుకీ ప్రైస్‌ ప్రొటెక్షన్‌ స్కీమ్‌

ఈ నెల 14 వరకు బుక్‌ చేసుకునే చిన్న కార్లకు వర్తింపు

న్యూఢిల్లీ: మారుతి సుజుకీ చిన్న కార్లను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్ల కోసం ప్రైస్‌ ప్రొటెక్షన్‌ స్కీమ్‌ను మంగళవారం ప్రకటించింది. ఈ నెల 14 వరకు బుకింగ్‌ చేసుకునే ఆల్టో కే10, ఎస్‌-ప్రెస్సో, సెలేరియో, వ్యాగన్‌ఆర్‌ మోడళ్లకు ఇది వర్తిస్తుందని పేర్కొంది. ఈ నెల నుంచి కార్ల ధరలను రూ.30,000 వరకు పెంచనున్నట్టు గత నెలలో మారుతి ప్రకటించింది. తాజా పథకం కింద చిన్న కార్లను బుకింగ్‌ చేసుకుంటే పెంచిన ధరల నుంచి రక్షణ లభిస్తుందని పేర్కొంది. తమ డీలర్ల నుంచి వచ్చిన అభిప్రాయాల మేరకు ఈ పథకాన్ని తెచ్చినట్టు మారుతి సుజుకీ ఇండియా మార్కెటింగ్‌, సేల్స్‌ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పార్థో బెనర్జీ తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి...

గుజరాత్‌కు ఎన్నాళ్లు గులాంలుగా ఉంటారు?: సీఎం రేవంత్‌

ప్రతి నియోజకవర్గంలో అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం: భట్టి విక్రమార్క

Read Latest Telangana News And AP News And National News

Updated Date - Jun 10 , 2026 | 03:09 AM