Share News

పతనబాటలోనే మార్కెట్లు

ABN , Publish Date - Jan 22 , 2026 | 05:46 AM

ఈక్విటీ మార్కెట్లో వరుసగా మూడో రోజు కూడా కల్లోలం కొనసాగింది. తీవ్ర ఆటుపోట్లతో సాగిన ట్రేడింగ్‌లో మార్కెట్‌ సూచీలు ప్రారంభంలో భారీగా నష్టపోయినప్పటికీ చివరలో లభించిన...

పతనబాటలోనే మార్కెట్లు

సెన్సెక్స్‌ 82,000 దిగువకు

ముంబై: ఈక్విటీ మార్కెట్లో వరుసగా మూడో రోజు కూడా కల్లోలం కొనసాగింది. తీవ్ర ఆటుపోట్లతో సాగిన ట్రేడింగ్‌లో మార్కెట్‌ సూచీలు ప్రారంభంలో భారీగా నష్టపోయినప్పటికీ చివరలో లభించిన కొనుగోళ్ల మద్దతుతో ఆ నష్టాలను కొంతమేరకు కుదించుకోగలిగాయి. షరా మామూలుగానే భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇన్వెస్టర్లను కొనుగోళ్లకు దూరంగా ఉంచాయి. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి మరో చారిత్రక కనిష్ఠ స్థాయికి దిగజారడం కూడా సెంటిమెంట్‌ను దెబ్బ తీసిందని విశ్లేషకులంటున్నారు. ఈ నేపథ్యంలో సెన్సెక్స్‌ 82,000 పాయింట్ల దిగువకు చేరింది. ఒక దశలో 1,056.02 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌ చివరికి ఆ నష్టాన్ని 270.84 పాయింట్లకు పరిమితం చేసుకుని 81,909.63 వద్ద ముగిసింది. నిఫ్టీ 75 పాయింట్లు నష్టపోయి 25,157.50 వద్ద ముగిసింది. బీఎ్‌సఈలో 2,831 షేర్లు నష్టాలతో ముగియగా 1,437 షేర్లు లాభపడ్డాయి. 137 మాత్రం లాభనష్టాలకు తావు లేకుం డా నిలకడగా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి..

కాకినాడ పీబీసీ కాల్వలో స్పిరిట్ లారీ బోల్తా.. ప్రజలకు అధికారుల హెచ్చరికలు

భారత్, ఇజ్రాయెల్ ఆర్థిక సహకారానికి దావోస్ వేదిక: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 22 , 2026 | 05:46 AM