Malabar Gold Karimnagar: కరీంనగర్‌లో సరికొత్తగా మలబార్ గోల్డ్ షోరూమ్
ABN , Publish Date - Jan 11 , 2026 | 04:48 AM
జువెలరీ రిటైలర్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కరీంనగర్‌లో షోరూమ్‌ను ప్రారంభించింది. సరికొత్త రూపం, అప్‌గ్రేడెడ్ ఫార్మాట్‌లో...
హైదరాబాద్: జువెలరీ రిటైలర్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కరీంనగర్‌లో షోరూమ్‌ను ప్రారంభించింది. సరికొత్త రూపం, అప్‌గ్రేడెడ్ ఫార్మాట్‌లో ఈ షోరూమ్‌ను ప్రారంభించినట్లు మలబార్ ప్రకటించింది. కరీంనగర్ శాసన సభ్యులు గంగుల కమలాకర్ ఈ షోరూమ్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఉత్తర తెలంగాణలో ఆభరణాల కొనుగోలులో తమకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలన్న ఆలోచనతో పాటు వినియోగదారులకు షాపింగ్ అనుభూతిని మరింతగా పెంచాలన్న ఆలోచనకు తగ్గట్టుగా సరికొత్త రూపంతో ఈ కొత్త షోరూమ్‌ను ప్రారంభించినట్లు తెలిపింది. ఈ కార్యక్రమంలో మలబార్ గోల్డ్ రిటైల్ ఆపరేషన్స్ హెడ్ సిరాజ్ పీకే, తెలంగాణ జోనల్ హెడ్ షానిబ్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఐఏఎస్ అధికారిపై తప్పుడు కథనం.. ఐఏఎస్ సంఘం రియాక్షన్ ఇదే..
ప్రజలకు తెలంగాణ డ్రగ్ కంట్రోల్ కీలక హెచ్చరికలు..
Read Latest Telangana News And Telugu News