Share News

ఎల్‌ఐసీ లాభంలో 23 శాతం వృద్ధి

ABN , Publish Date - May 22 , 2026 | 02:48 AM

దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బీమా సంస్థ అయిన లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) 2025-26 ఆర్థిక సంవత్సరం...

ఎల్‌ఐసీ లాభంలో 23 శాతం వృద్ధి

  • క్యూ4లో రూ.23,420 కోట్లు

  • ఒక్కో షేరుకు రూ.10 తుది డివిడెండ్‌

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బీమా సంస్థ అయిన లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) 2025-26 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికానికి (క్యూ4) రూ.23,420 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఆర్జించిన నికర లాభం (రూ.19,013 కోట్లు)కన్నా ఇది 23 శాతం అధికం. సమీక్షా త్రైమాసికం లో ఎల్‌ఐసీ మొత్తం ఆదాయం రూ.2,22,805 కోట్ల నుంచి రూ.2,53,592 కోట్లకు పెరిగింది. ఈ ఏడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరం (2025-26)లో ఎల్‌ఐసీ రూ.57,419 కోట్ల లాభాన్ని ఆర్జించింది. క్రితం ఆర్థిక సంవత్సరంలో సంస్థ ఆర్జించిన నికర లాభం (రూ.48,151 కోట్లు) తో పోల్చితే వృద్ధి 19 శాతంగా ఉంది. కాగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరు కు రూ.10 తుది డివిడెండ్‌ను బీమా సంస్థ బోర్డు సిఫారసు చేసింది. మరోవైపు వాటా దారులకు 1:1 నిష్పత్తిలో ఇంతకు ముందు బోనస్‌ షేర్లను ప్రకటించగా దీనికి రికార్డు తేదీగా మే 29ని నిర్ణయించారు.

ఇవి కూడా చదవండి...

దళిత డ్రైవర్ హత్య కేసు.. రాజమండ్రి కోర్టులో రెండో రోజు విచారణ

కిరీటం మాయంపై విచారణ.. అందుబాటులోని లేని ట్రస్ట్‌ సభ్యులు.. ఏసీ ఆగ్రహం

Read Latest AP News And Telugu News

Updated Date - May 22 , 2026 | 02:48 AM