లారస్ ల్యాబ్స్ లాభంలో రెండింతల వృద్ధి
ABN , Publish Date - Oct 30 , 2026 | 05:59 AM
లారస్ ల్యాబ్స్.. సెప్టెంబరు తో ముగిసిన త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. జూలై-సెప్టెంబరు త్రైమాసికాని..
క్యూ2లో రూ.441 కోట్లుగా నమోదు
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): లారస్ ల్యాబ్స్.. సెప్టెంబరు తో ముగిసిన త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. జూలై-సెప్టెంబరు త్రైమాసికాని (క్యూ2)కి గాను కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం ఏకంగా రెండింతలు వృద్ధి చెంది రూ.441 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో లాభం రూ.195 కోట్లుగా ఉంది. సమీక్షా త్రైమాసికంలో కంపెనీ రెవెన్యూ కూడా 33 శాతం వృద్ధితో రూ.1,653 కోట్ల నుంచి రూ.2,206 కోట్లకు పెరిగింది. సీడీఎంఓ, అఫర్డబుల్ మెడిసిన్స్ విభాగంలో మంచి వృద్ధిని నమోదు చేయటం కలిసివచ్చిందని కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ సత్యనారాయణ చావా పేర్కొన్నారు. కాగా వైజాగ్‌లోని పెప్టైడ్ ప్లాంట్‌లో కటింగ్ ఎడ్జ్ ఆపరేటింగ్ విధానాలను వినియోగించటం ద్వారా వాణిజ్యపరమైన ఉత్పత్తిని ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది.
గాలెన్వస్ సైన్స్‌లో 60% వాటా: కెనడా కేంద్రంగా ఉన్న గాలెన్వస్ సైన్స్‌లో 60 శాతం వాటా కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు లారస్ ల్యాబ్స్ వెల్లడించింది. అలాగే ఎస్‌ఐ అండ్ సీ రైసిన్స్ కంపెనీలో 52 శాతం వాటా కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎట్టి పరిస్థితుల్లోనూ తాగునీటి సమస్య రావద్దు.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
ఎల్‌నినోపై తెలంగాణ సర్కార్ ఫోకస్.. మండల స్థాయిలో ప్రత్యేక కమిటీలు
ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే ఏఐ వినియోగ లక్ష్యం: భట్టి విక్రమార్క
Read Latest Telangana News And AP News And National News
And Telugu News