Share News

రూ.లక్ష కోట్ల ‘కల్యాణి’ ఆస్తి తగాదాకు మధ్యవర్తిగా జస్టిస్‌ లావు నాగేశ్వర రావు

ABN , Publish Date - Jul 14 , 2026 | 05:30 AM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న భారత్‌ ఫోర్జ్‌ చైర్మన్‌ బాబా కల్యాణి, ఆయన సోదరి సుగంధ హిరేమఠ్‌ల...

రూ.లక్ష కోట్ల ‘కల్యాణి’ ఆస్తి తగాదాకు మధ్యవర్తిగా జస్టిస్‌ లావు నాగేశ్వర రావు

న్యూఢిల్లీ (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న భారత్‌ ఫోర్జ్‌ చైర్మన్‌ బాబా కల్యాణి, ఆయన సోదరి సుగంధ హిరేమఠ్‌ల మధ్య రూ.లక్ష కోట్లకు పైగా విలువైన ఆస్తి వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మహా తగాదాను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావును మధ్యవర్తిగా నియమిస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. భారత్‌ ఫోర్జ్‌, కల్యాణి స్టీల్స్‌ మొదలైన కంపెనీలకు చెందిన రూ.1.05 లక్షల కోట్ల ఆస్తులను ఎవరికి అప్పజెప్పాలనే విషయంపై ఆయన మధ్యవర్తిత్వం చేయనున్నారు. కల్యాణి గ్రూప్‌ కంపెనీల పేరు మీద ఉన్న ఆస్తులన్నీ అవిభక్త హిందూ కుటుంబానికి చెందుతాయని, అందువల్ల దానికి సంబంధించిన ఆస్తుల్లో తమకు వాటా కావాలని బాబా కల్యాణి సోదరి సుగంధ కోరుతోంది. ఆ ఆస్తుల్లో తమకు మూడో వంతు కావాలని ఆమె కోర్టు తలుపు తట్టారు.

అయితే, అలాంటి హిందూ అవిభక్త కుటుంబం అంటూ ఏమీలేదని, ఈ ఆస్తులన్నీ తాము సంపాదించినవేనని బాబా కల్యాణి, ఆయన సోదరుడు గౌరీ శంకర్‌ కల్యాణి వాదిస్తున్నారు. ఈ వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా తేల్చుకోవాలని బాంబే హైకోర్టు ఆదేశించినప్పటికీ కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. సుప్రీంకోర్టు సైతం బాంబే హైకోర్టు తీర్పునే సమర్థించింది. వివాద పరిష్కార బాధ్యతలను జస్టిస్‌ లావు నాగేశ్వరరావుకు అప్పగించింది.

ఈ వార్తలు కూడా చదవండి...

దేవాలయాల అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు: మంత్రి కొండా సురేఖ

హైదరాబాద్‌లో ఈగల్ ఫోర్స్ మెగా ఆపరేషన్..

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 14 , 2026 | 05:30 AM