Share News

'ఇది కేవలం ట్రైలర్ మాత్రమే.. ఏఐ ప్రభావంతో కోట్ల ఉద్యోగాలు కనుమరుగు..'

ABN , Publish Date - May 26 , 2026 | 04:10 PM

భారత్‌లో వైట్ కాలర్ ఉద్యోగాలకు సమీప భవిష్యత్తులో పెద్ద ముప్పు పొంచి ఉందని ప్రముఖ మార్కెట్ నిపుణుడు సౌరభ్ ముఖర్జీయా అన్నారు. మనుషులు చేసే పనులను ఆటోమేట్ చేయడానికి కంపెనీలు పోటీ పడుతున్నందున కోట్ల ఉద్యోగాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.

'ఇది కేవలం ట్రైలర్ మాత్రమే.. ఏఐ ప్రభావంతో కోట్ల ఉద్యోగాలు కనుమరుగు..'
AI layoffs India

భారత్‌లో వైట్ కాలర్ ఉద్యోగాలకు సమీప భవిష్యత్తులో పెద్ద ముప్పు పొంచి ఉందని ప్రముఖ మార్కెట్ నిపుణుడు సౌరభ్ ముఖర్జీయా అన్నారు. మనుషులు చేసే పనులను ఆటోమేట్ చేయడానికి కంపెనీలు పోటీ పడుతున్నందున కోట్ల ఉద్యోగాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన సౌరభ్.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ ప్రభావం గురించి మాట్లాడారు (AI layoffs India).


ఏఐ (AI) వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కోట్ల మంది వైట్ కాలర్ ఉద్యోగాలు కనుమరుగవుతాయని సౌరభ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం టెక్ రంగంలో కనిపిస్తున్న ఉద్యోగ కోతలు కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు ప్రభావం ఇంకా ముందుందని ఆయన వ్యాఖ్యానించారు. 2030 నాటికి భారత్‌లో సుమారు 1.8 కోట్ల ఉద్యోగాలు ఏఐ కారణంగా కనుమరుగవుతాయన్నారు. కొత్తగా కేవలం 30 లక్షల టెక్ ఉద్యోగాలే వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో దాదాపు 1.5 కోట్ల ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయని ఆయన అభిప్రాయపడ్డారు (white collar jobs crisis).


ప్రస్తుతం ఏఐ కోడింగ్, డిజిటల్ టాస్క్‌లలో మానవ వనరుల అవసరం దాదాపు 50 శాతానికి పడిపోయిందని (AI automation) మరో రెండు, మూడు సంవత్సరాల్లో ఇది 90 నుంచి 100 శాతం వరకు చేరవచ్చని ఆయన అన్నారు. అప్పుడు పెద్ద ఎత్తున ఉద్యోగాల కోతలు ప్రారంభమవుతాయని హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి..

ఎండల్లో కూల్ టెక్నిక్.. స్కూటీకి ఏసీని ఎలా అమర్చాడో చూడండి..


నష్టాలతో ప్రారంభమై కోలుకున్నాయి.. సూచీలకు స్వల్ప లాభాలు..

Updated Date - May 26 , 2026 | 04:19 PM