Share News

దాతృత్వ కార్యకలాపాలకు రూ.100 కోట్లు

ABN , Publish Date - Nov 03 , 2026 | 06:05 AM

దేశంలో దాతృత్వ కార్యకలాపాల కోసం రూ.100 కోట్లు కేటాయించినట్లు జోయాలుక్కాస్‌ గ్రూప్‌ ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఆర్థికంగా, సామాజికంగా...

దాతృత్వ కార్యకలాపాలకు రూ.100 కోట్లు

హైదరాబాద్‌: దేశంలో దాతృత్వ కార్యకలాపాల కోసం రూ.100 కోట్లు కేటాయించినట్లు జోయాలుక్కాస్‌ గ్రూప్‌ ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు గృహాలను నిర్మించటం, బాలికల విద్య, మహిళా సాధికారిత, పర్యావరణ పరిరక్షణ, వృద్ధులకు చేయూతనందించటంతో పాటు ఇతరత్రా కార్యక్రమాలకు ఈ మొత్తాలను వినియోగించనున్నట్లు వెల్లడించింది. జోయాలుక్కాస్‌ గ్రూప్‌ వ్యవస్థాపకుడు, చైర్మన్‌ జోయ్‌ అలుక్కాస్‌ 70వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ దాతృత్వ కార్యకలాపాలను కేరళం ముఖ్యమంత్రి వీడీ సతీషన్‌ లాంఛనంగా ప్రారంభించారు. జోయాలుక్కాస్‌ ఇప్పటికే పలు ఛారిటబుల్‌ ప్రాజెక్టుల కింద రూ.కోట్లు ఖర్చు చేసిందని, రానున్న రోజుల్లో మరింత మందికి సేవలందించాలనే ఉద్దేశంతో తాజాగా నిధులు కేటాయిస్తున్నట్లు గ్రూప్‌ చైర్మన్‌ జోయ్‌ అలుక్కాస్‌ తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..

పసిడి రుణాలకు భలే గిరాకీ

అక్టోబరులో జీఎస్‌టీ వసూళ్లు రూ.2.31 లక్షల కోట్లు

For More Business News And Telugu News


Updated Date - Nov 03 , 2026 | 06:06 AM