జోస్ అలుక్కాస్లో ప్రత్యేక ఆఫర్లు
ABN , Publish Date - Oct 18 , 2026 | 05:50 AM
జువెలరీ రిటైలర్ జోస్ అలుక్కాస్.. తెలంగాణలో ప్రత్యేక ఆఫర్లతో స్టోర్ వార్షికోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్లోని...
హైదరాబాద్: జువెలరీ రిటైలర్ జోస్ అలుక్కాస్.. తెలంగాణలో ప్రత్యేక ఆఫర్లతో స్టోర్ వార్షికోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్, బేగంపేట్, కూకట్పల్లి, చందానగర్ సహా నిజామాబాద్, ఖమ్మం, వరంగల్ షోరూమ్ల్లో ఈ నెల 21 వరకు ఈ ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉంటాయని జోస్ అలుక్కాస్ వెల్లడించింది. షోరూమ్ వార్షికోత్సవాల్లో భాగంగా సరికొత్త డిజైన్లతో కూడిన బంగారం, వజ్రాలు, ప్లాటినం ఆభరణాలు అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది. ఎంపిక చేసిన డైమండ్ జువెలరీపై ఎలాంటి మేకింగ్ చార్జీలు విధించటం లేదని తెలిపింది. అలాగే బంగారు ఆభరణాల తయారీ చార్జీలపై 30 శాతం వరకు రాయితీతో పాటు వజ్రాభరణాలు, ప్లాటినం ఆభరణాలపై 30 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు పేర్కొంది. ఆఫర్ సమయంలో ప్రతి కొనుగోలుపై ప్రత్యేక బహుమతిని కూడా అందిస్తున్నట్లు జోస్ అలుక్కాస్ తెలిపింది.
జోస్ అలుక్కాస్కు తెలంగాణ కీలక మార్కెట్ ఉందని, కొన్నేళ్లుగా వినియోగదారులు తమను ఎంతగానో ఆదరిస్తూ వస్తుండటంతో వారి కోసం ప్రత్యేకంగా స్టోర్ వార్షికోత్సవం పేరిట ప్రత్యేక ఆఫర్లను తీసుకువచ్చినట్లు సంస్థ ఎండీ పాల్ అలుక్కాస్ వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. కూటమి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు
మహిళలు స్వయంకృషితో ఎదిగేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ చేయూత: నారా భువనేశ్వరి
ద్వారకా తిరుమలలో 21 నుంచి 28 వరకు బ్రహ్మోత్సవాలు
Read Latest AP News And Telangana News And National News