Share News

21 నుంచి జియో ఐపీఓ

ABN , Publish Date - Oct 15 , 2026 | 06:28 AM

మార్కెట్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీ్‌సకు చెందిన టెలికాం, డిజిటల్‌ సేవల అనుబంధ సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్‌ లిమిటెడ్‌(జేపీఎల్‌) తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌(ఐపీఓ) ఈ నెల 21న ప్రారంభమై 23న ముగియనుంది....

21 నుంచి జియో ఐపీఓ

  • ధరల శ్రేణి రూ.1,065-రూ.1,119

  • రూ.30,213 కోట్ల వరకు సమీకరణ!

  • దేశంలో ఇప్పటివరకిదే అతిపెద్ద ఐపీఓ

  • ఈ నెల 28న మార్కెట్లో షేర్ల లిస్టింగ్‌

ముంబై: మార్కెట్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీ్‌సకు చెందిన టెలికాం, డిజిటల్‌ సేవల అనుబంధ సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్‌ లిమిటెడ్‌(జేపీఎల్‌) తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌(ఐపీఓ) ఈ నెల 21న ప్రారంభమై 23న ముగియనుంది. మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీకి బుధవారం సమర్పించిన తుది పత్రాల్లో (రెడ్‌ హెరింగ్‌ ప్రాస్పెక్టస్‌- ఆర్‌హెచ్‌పీ)లో కంపెనీ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ ఐపీఓ ద్వారా ఒక్కోటి రూ.10 ముఖవిలువ కలిగిన 27 కోట్ల తాజా షేర్లను జేపీఎల్‌ జారీ చేస్తోంది. కాగా, ఐపీఓలో విక్రయించనున్న షేర్ల ధరల శ్రేణిని కంపెనీ రూ.1,065-1,119గా నిర్ణయించింది. ధరల శ్రేణిలో గరిష్ఠ స్థాయి ప్రకారంగా కంపెనీ రూ.30,213 కోట్లు సమీకరించే అవకాశం ఉంది. అంటే, భారత మార్కెట్‌ చరిత్రలో ఇదే అతిపెద్ద ఐపీఓ కానుంది. ఈ పబ్లిక్‌ ఆఫరింగ్‌లో భాగంగా కంపెనీ రూ.500 కోట్ల విలువైన షేర్లను జేపీఎల్‌ ఉద్యోగులకు, రూ.2,500 కోట్ల విలువైన షేర్లను రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వాటాదారులకు రిజర్వ్‌ చేసింది. జేపీఎల్‌ షేర్లు ఈ నెల 28న స్టాక్‌ ఎక్స్చేంజీల్లో నమోదయ్యే అవకాశం ఉంది.

డెయిరీ బెవరేజె్‌సలోకి రిలయన్స్‌ : రిలయన్స్‌ ఇండస్ట్రీ్‌సకు చెందిన ఎఫ్‌ఎంసీజీ కంపెనీ రిలయన్స్‌ కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ తాజాగా డెయిరీ బెవరేజె్‌స విభాగంలోకి ప్రవేశించింది. జాయ్‌లాండ్‌ ఫ్లేవర్డ్‌ మిల్క్‌ను కంపెనీ బుధవారం తమిళనాడు మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని ధర రూ.20గా ఉంది. తద్వారా కంపెనీ ఐటీసీ, అమూల్‌ తదితర కంపెనీలకు పోటీ ఇవ్వనుంది.

ఇవి కూడా చదవండి:

తన పని తాను చేశాడు.. ఫలితం వెతుక్కుంటూ వచ్చింది: అశ్విన్

ప్రయాణాన్ని కొత్తగా ప్రారంభిస్తున్నాం.. మళ్లీ ఒక్కటైన క్రికెటర్ పృథ్వీ షా-ఆకృతి

పోలీసుల దాడుల్లో ఓ విద్యార్థిని వినికిడి శక్తి కోల్పోయింది.. దీనికి బాధ్యులెవరు? : రాహుల్ గాంధీ

Updated Date - Oct 15 , 2026 | 06:28 AM