కంటి చూపుతో చెల్లింపులు
ABN , Publish Date - Oct 11 , 2026 | 05:46 AM
షాపింగ్ చేసినప్పుడు జేబులోంచి నగదు లేదా ఫోన్ లేదా డెబిట్/క్రెడిట్ కార్డు బయటికి తీయాల్సిన అవసరం లేకుండా కంటి చూపుతో చెల్లించవచ్చిక...
జియో ఏఐ గ్లాసెస్ ఆవిష్కరణ
న్యూఢిల్లీ: షాపింగ్ చేసినప్పుడు జేబులోంచి నగదు లేదా ఫోన్ లేదా డెబిట్/క్రెడిట్ కార్డు బయటికి తీయాల్సిన అవసరం లేకుండా కంటి చూపుతో చెల్లించవచ్చిక. ఇందుకోసం తయారు చేసిన ఏఐ ఆధారిత కళ్లద్దాలను ముకేశ్ అంబానీకి చెందిన జియో..‘ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 2026’లో ప్రదర్శించింది. ఈ జియో ఏఐ గ్లాసెస్ ధరించి క్యూఆర్ కోడ్ వైపు చూసి మౌఖిక ఆదేశమిస్తే చాలు చెల్లింపు పూర్తవుతుంది. యూపీఐలో సర్కిల్స్ ఫీచర్స్ ద్వారా ఈ పద్ధతిలో ఒకసారి రూ.5,000 వరకు, నెలలో మొత్తం రూ.15,000 వరకు చెల్లింపులు జరిపే వీలుంటుంది. అంతేకాదు, ఈ కళ్లద్దాల్లోని ఏఐ వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ పలు భారతీయ భాషలను వినియోగదారుకు కావాల్సిన భాషలోకి అనువదించగలదు.
ఇవి కూడా చదవండి:
కోహ్లీ రిటైర్మెంట్ వెనుక అజిత్ అగార్కర్ పాత్ర ఉందేమో.. వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు!
ఆ తప్పు వల్లే మ్యాచ్ కోల్పోయాం: సునీల్ గావస్కర్
టీమిండియాతో సిరీస్.. న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ