Share News

JanSamarth Portal: బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం లేదు.. ఈ వెబ్‌సైట్లో అందుబాటులో 15 రకాల లోన్స్

ABN , Publish Date - Jan 16 , 2026 | 10:08 AM

ఇకపై లోన్ కోసం కష్టపడాల్సిన అవసరం లేదు. బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం అంతకంటే లేదు. జనసమర్థ్ వెబ్‌సైట్‌లో నమోదు అయితే అత్యంత ఈజీగా, వేగంగా లోన్ పొందొచ్చు.

JanSamarth Portal: బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం లేదు.. ఈ వెబ్‌సైట్లో అందుబాటులో 15 రకాల లోన్స్
JanSamarth Portal

బ్యాంకుల నుంచి లోన్స్ పొందటం అన్నది ఎంత కష్టమైన పద్ధతో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లోన్ ప్రాసెస్ పూర్తయి ఖాతాలో డబ్బులు పడాలంటే ఓ యుద్ధమే చేయాల్సి వస్తుంది. కానీ, ఇకపై లోన్ కోసం కష్టపడాల్సిన అవసరం లేదు. బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం అంతకంటే లేదు. జనసమర్థ్ వెబ్‌సైట్‌లో నమోదు అయితే అత్యంత ఈజీగా, వేగంగా లోన్ పొందొచ్చు. వ్యవసాయం, విద్య, హోమ్, బిజినెస్ లోన్స్ పొందొచ్చు. అది కూడా కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా మనం లోన్స్ పొందే అవకాశం ఉంటుంది. కేంద్రం ఏ జిల్లాలో ఏ పథకాలు అమలు చేస్తోంది? రాయితీలేంటి అన్న సంగతులు తెలుసుకుని మరీ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. వాటిని బట్టే రుణాలు వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ వెబ్‌సైట్‌తో లింక్ ఉంది. ఈ వెబ్‌సైట్‌లో 8 విభాగాల్లో.. 15 రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి.


అందుబాటులో ఉన్న రుణాలు ఇవే..

ఎడ్యుకేషన్ లోన్స్..

  • పఢో పరదేశ్ పథకం.

  • ఓబీసీ, ఈబీసీ విద్యార్థులకు డాక్టర్ అంబేద్కర్ సీఎస్ఐఎస్.

  • కేంద్ర ప్రభుత్వ వడ్డీ రాయితీ ( సీఎస్ఐఎస్)

హోమ్ లోన్స్..

  • పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస యోజన ( పీఎంఏవై యూ 2.0 )

ఈ కిసాన్ ఉపాజ్ నిధి

  • వ్యవసాయ ఉత్పత్తుల్ని వేర్ హౌస్ డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ పరిధిలోని గోదాముల్లో నిల్వ చేసి సంబంధిత రశీదులతో రుణాలు తీసుకోవచ్చు.

వ్యవసాయం, వ్యవసాయ మౌలిక సౌకర్యాల నిధి రుణాలు

  • వ్యవసాయ మౌలిక సౌకర్యాల అభివృద్ధి నిధి (ఏఐఎఫ్)

  • అగ్రి క్లినిక్స్, అగ్రి బిజినెస్ కేంద్రాలు (ఏసీఏబీసీ)

  • కిసాన్ క్రెడిట్ కార్డులు

  • కిసాన్ క్రెడిట్ కార్డు (మత్స్య)


రూఫ్ టాప్ సోలార్

  • పీఎం సూర్యఘర్ పథకం కింద ఇందులో నమోదు చేసుకోవచ్చు.

ఎక్స్‌పోర్టర్స్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్

  • చిన్న, సూక్ష్మ స్థాయి పరిశ్రమలు సహా అర్హులైన ఎగుమతిదారులకు అదనపు రుణం లభిస్తుంది. రాయితీ రుణాల కోసం దరఖాస్తు చేయవచ్చు.

బిజినెస్ లోన్స్

  • పీఎం ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ ప్రోగ్రాం.

  • నేతన్నలకు ముద్ర స్కీమ్.

  • ప్రధానమంత్రి ముద్ర యోజన.

  • ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మ నిర్భర్ పథకం.

  • నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకో సిస్టమ్.

  • స్టార్టప్ రుణాలు.

జనసమర్థ్ పార్ట్‌నర్స్ ఎవరంటే..

జనసమర్థ్ ప్లాట్ ఫామ్‌లో ఏకంగా 250 ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులతో పాటు ఫినాన్స్, నాన్ ఫినాన్స్ సంస్థల ద్వారా లోన్స్ పొందొచ్చు.

  • ప్రభుత్వ బ్యాంకులు 12

  • ప్రైవేట్ రంగ బ్యాంకులు 19

  • నాన్ బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలు 7

  • గ్రామీణ బ్యాంకులు 43

  • స్మాల్ ఫినాన్స్ బ్యాంకులు 5

  • జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు 164


లోన్స్ ఎలా పొందాలి?

  • జనసమర్థ్ అఫిషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.

  • పోర్టల్‌లో మొబైల్ ఫోన్ నెంబర్ లేదా ఈమెయిల్ ద్వారా లాగిన్ అవ్వాలి.

  • ఓటీపీ ద్వారా ఫ్రొఫైల్ క్రియేట్ అవుతుంది.

  • అక్కడ లోన్ స్కీమ్స్ ఉంటాయి. వాటిలో మీకు ఏది కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి.

  • అక్కడ అర్హత పరిశీలించుకోవాలి. ఆ తర్వాతే దరఖాస్తు చేసుకోవాలి.

  • ఇందుకోసం ఆధార్, పాన్, బ్యాంకు అకౌంట్ లేదా స్టేట్‌మెంట్, ఆదాయ ధ్రువీకరణ, గుర్తింపు, విద్య, వ్యాపార సంబంధ పత్రాలు కావాల్సి ఉంటుంది.


ఇవి కూడా చదవండి

మనవడి సర్‌ప్రైజ్.. వృద్ధాప్యంలో మొదటి సారి విమాన ప్రయాణం

మాట నిలబెట్టుకున్న మచాడో.. నోబెల్​ శాంతి బహుమతి ట్రంప్ కు అందజేత

Updated Date - Jan 16 , 2026 | 10:47 AM